విశాఖపట్నం

సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: ప్రతి ఒక్కరూ సనాతాన ధర్మాన్ని ఆచరించి తీరాలని ప్రవచన చక్రవర్తి, డాక్టర్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుఅన్నారు. విశాఖ నగరంలోని గురువారం వుడా చిల్డ్రన్ థియేటర్‌లో శ్రీముద్భాగవతాంతర్గత ప్రార్థనలు-వైశిష్ట్యము అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల కర్మసారాన్ని బట్టి ప్రతి మనిషికి పునర్‌జన్మ తప్పదన్నారు. సుఖ,దుఖాలు జీవితంలో సహజమని, భగవంతుని ప్రార్ధించి కష్టాలను తొలగించుకొవాలన్నారు. మనం చేసుకున్న కర్మనుసారం ఆయా ఫలితాలను మనమే అనుభవించాలన్నారు. కర్మఫలితాన్ని తొలగించగలిగే శక్తి ఒక్క భగవంతునికే ఉందన్నారు. ప్రతీ విషయం పరమాత్మ సంకల్పతోనే జరుగుతుందని కనుక పరమాత్ముని స్మరించుకుంటూ తమ తమ జీవితాలను పునీతం చేసుకొవాలన్నారు. ఈ సందర్భంగా వీ ఎం ఆర్‌డీ ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావును నగర వాసులందరి తరపున పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చాగంటి సత్సంగం అధ్యక్షుడు కె.వి. రమణమూర్తి, కార్యదర్శి రమణాచారి, ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త ఎంవీ రాజశేఖర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇక గ్రేటర్ పాఠశాలల్లో 3స్మార్ట్2 పరీక్షలు
* రివిజన్ టెస్టుల నిర్వహణకు కొత్త యాప్‌లు
* ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణతో విద్యార్థులకు సమయం ఆదా
* నూతన సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్న గ్రేటర్ అధికారులు
విశాఖపట్నం, నవంబర్ 21: స్మార్ట్ కాస్లులు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు సరికొత్త విద్యాబోధన అందిస్తున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న విధానానికి శ్రీకారం చుడుతోంది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు స్మార్ట్ బోధన సాగిస్తోంది. డిజిటల్ క్లాసులు చెప్పిన అనంతరం ఆ పాఠ్యాంశానికి సంబంధించిన పరీక్షల్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల ముందుగా రివిజన్ టెస్టులు ఆన్‌లైన్‌లో పరీక్షా విధానాన్ని యూనిట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలకూ క్రమంగా విస్తరించే ఆలోచన చేస్తోంది. స్మార్ట్ కాస్లుల్ని 2017 విద్యా సంవత్సరం నుంచి జీవీ ఎంసీ ప్రారంభించింది. తొలుత మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకూ డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, స్మార్ట్‌క్లాసులు పరిచయం చేసిన జీవీ ఎంసీ. ఇప్పుడు 1 నుంచి 8 వరకూ స్మార్ట్‌క్లాసులనూ, 10వ తరగతి వరకూ డిజిటల్ తరగతుల్ని బొధిస్తుంది. దీని ద్వారా పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, పాఠ్యాంశాలపై అవగాహన, ఆసక్తి, ఉత్సాహం పెరుగుతోంది.