విశాఖపట్నం

లక్ష్మీపురం భూములపై ల్యాండ్ మాఫియా కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 3: వారసులు ఎవరో తెలీని భూమికి నకిలీ వారసులు పుట్టుకొచ్చేశారు. రూ. 75 కోట్ల విలువైన భూములు కాజేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. విశాఖ నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న భూ దందాకు ఇదే నిదర్శనం. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌పై భూకబ్జా కేసుతో పలు ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ నగర పరిధిలో అత్యంత విలువైన భూమికి సంబంధించి కొంతకాలంగా జరుగుతున్న తంతు మాజీ ఎమ్మెల్యేపై కేసుతో బయటపడింది. పెందుర్తి మండలం లక్ష్మీపురం గ్రామం సర్వే నెంబర్ 81/1లో 11.63 ఎకరాల భూమి తిరుమలరాజు నారాయణ మూర్తి పేరిట రికార్డుల్లో నమోదై ఉంది. దశాబ్దాలుగా ఈ భూమికి సంబంధించి యాజమాన్య హక్కులు నారాయణ మూర్తి పేరిటే కొనసాగుతున్నాయి. అయితే నారాయణ మూర్తి, ఆయన వారసులు ఎవరూ ఈ భూముల అనుభవంలో లేరు. గ్రామం మొత్తం ఈ భూమిని చెరువుగా భావించారు. నగరం విస్తరించడంతో లక్ష్మీపురం గ్రామంలో భూముల విలువ కోట్లకు చేరింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం లక్ష్మీపురం వివాదాస్పద భూముల విలువ సుమారు రూ.75 కోట్లకు పైమాటే. కోట్లు విలువ చేసే భూములపై ల్యాండ్ మాఫియా కన్ను పడింది. ఇంకేముంది... అసలు వారసులెవరని ఆరా తీశారు. నారాయణమూర్తి అనే వ్యక్తిగానీ, అయన రక్త సంబంధీకులు గానీ ఎవరూ లేకపోవడంతో విలువైన భూములను కాజేసే కుట్రకు తెరతీశారు. అదే ఇంటిపేరుతో ఉన్న కొంతమందిని తెరపైకి తెచ్చారు. రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా డాక్యుమెంట్లను సృష్టించుకున్నారు. రాజకీయ జోక్యంతో అధికారులను భయపెట్టి, దక్కించుకునే భూముల్లో వాటాలు ఎరవేసి తాము అనుకున్నది సాధించేలా అన్నీ అనుకూలంగా చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఆర్‌డిఓ కోర్టుకు, న్యాయస్థానానికి వెళ్లారు. ఇక ఒకరికి భూములు దఖలుపడతాయనే తరుణంలో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. ల్యాండ్ మాఫియా కనే్నసిన భూములను ఆనుకుని మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌కు సర్వేనెంబర్ 81/2,3లో పట్ట్భామి ఉంది. పట్ట్భామిని ఆనుకుని ఉన్న తిరుమలరాజు నారాయణ రాజుకు చెందిన జిరాయితీ భూమిలో కొంతభాగం ద్రోణంరాజు సాగుబడిలో ఉంది. పట్టాలను సృష్టించుకున్న ల్యాండ్ మాఫియా ద్రోణంరాజు ఆధీనంలో ఉన్న భూములు తమవే అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంలో కొంతమంది అధికార పార్టీ పెద్దల జోక్యం ఉండటంతో పోలీసులు ద్రోణంరాజుపై భూకబ్జా కేసు నమోదు చేశారు.