విశాఖపట్నం

26 నుండి సిటు మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 7: రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా సిఐటీయు మహాసభల విజయవాడలో నిర్వహిస్తామని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు. యల్లమ్మతోట సిఐటియు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన నుంచి 29 వరకు వరుసగా మూడు రోజులపాటు ఇవి జరుగుతాయన్నారు. రాష్ట్రంలో గల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు రంగం, అసంఘటిత రంగం, చిన్న తరహా పరిశ్రమలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర రంగాలకు చెందిన కార్మిక నాయకులు పాల్గొంటారన్నారు. మహాసభల తొలి రోజున లక్షమంద కార్మికులతో విజయవాడలో భారీ ర్యాలీ ఉంటుందన్నారు. ఈ సభలో సిటు అఖిలభారత నాయకులు మాణిక్ సర్కార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. ఈ సభల విజయవంతంలో భాగంగా నగరంలో ఈ నెల 22వ తేదీ నుంచి 24వరకు ఐదు జాతాల నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభల్లో విశాఖ నుంచి ప్రధానంగా 12 సమస్యలు ప్రస్తావిస్తామన్నారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, జీవో 279 రద్దు చేయడం, నూతన రోడ్డు రవాణా చట్టం రద్దు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి సొంత గనులు, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం, పీఆర్‌సీ ప్రకారం వేతనాల చెల్లింపు వంటివి ఇందులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో సిటు కోశాధికారి ఎన్.జ్యోతీశ్వరరావు, అధ్యక్షుడు ఆర్‌కెఎస్‌వి కుమార్‌లు పాల్గొన్నారు.