విశాఖ

సర్పంచ్ చెక్ పవర్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), జూన్ 7: గ్రామాలు అభివృద్ధి విషయంలో సర్పంచ్‌లు నిర్లక్ష్యం వహించినట్లయితే ప్ర భుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి చెక్‌పవర్ రద్దు చేయిస్తానని ఎమ్మెల్యే పీ లా గోవింద హెచ్చరించారు. స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మంగళవారం జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఎ మ్మెల్యే పీలా పైవిధంగా అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీలకు అ తీతంగా అన్ని గ్రామాలు అభివృద్ధి చే యడానికి తన వంతుగా కృషి చేస్తున్నానన్నారు. సుమారు నాలుగు గ్రామాల్లో వైకాపా సర్పంచ్‌లు నిర్లక్ష్యం వలన ఆ గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయం లో పార్టీల ఫీలింగ్ చూపించాలని, గ్రా మ అభివృద్ధి విషయంలో కాదన్నారు. పార్టీలు, రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాల అభివృద్ధికి తమతో సహకరించాలన్నారు. నవ నిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా బుధవారం స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవ నిర్మాణ దీక్షలోజరిగిన కార్యక్రమాలుపై చర్చిస్తామన్నారు. అధికారులు, అంగన్‌వాడీలు పార్టీ కార్యకర్తలు, నాయకులు తప్పనిసరిగా రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి, జెడ్పీటిసి పల్లెల గంగాభవానీ, తహశీల్థార్ కృష్ణమూర్తి, ఎంపిడిఓ వెంకట రమణ పాల్గొన్నారు.