విశాఖపట్నం

యట్స్‌ఆఫ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించాలని మూడు సంవత్సరాల కిందట నిర్ణయం.. రెండేళ్ల కిందట అంకురార్పరణ.. నాలుగు నెలల నుంచి ఏర్పాట్లు.. 10 రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా చేపట్టిన పనులు. అధికార యంత్రాంగం చేసిన కృషికి, నగర ప్రజల సహకారానికి ప్రతిబింబంగా నిలిచింది విశాఖలో గత నాలుగు రోజులుగా విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. విశాఖ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ స్థాయికి పెంచిన భారత నౌకాదళానికి విశాఖ ప్రజలు రుణపడి ఉంటారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ దేశ ఆర్థిక, వాణిజ్యాన్ని పెంపొందించే విధంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను వివిధ దేశాల నౌకాదళాలు తెలుసుకోగలిగాయి. మన దేశానికి స్నేహ హస్తాన్ని అందిస్తున్న వివిధ దేశాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ముందు భారత నౌకాదళం తన బలాన్ని నిరూపించుకుంది. గడచిన నాలుగు రోజుల్లో విశాఖ నగరానికి దేశ, విదేశాల నుంచి వేలాది మంది ప్రముఖులు తరలి వచ్చారు. భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి పారికర్ సహా అనేక మంది ప్రముఖులు నగరానికి రావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఫ్లీట్ రివ్యూని పురస్కరించుకుని నగరం సుందర నందనంగా తయారైంది. విశాఖ నగర ప్రాముఖ్యత జాతీయ ఛానళ్లలో ప్రసారం కావడంతో అందరి దృష్టి విశాఖపైనే మళ్లింది. విశాఖ అందాలను చూసి ప్రముఖులు ముచ్చటపడ్డారు. 14 నెలల కిందట సంభవించిన హుదూద్ తుపాను మరుసటి రోజే నగరానికి వచ్చి ఆవేదనకు గురైన ప్రధాని మోదీ, ఆదివారం తన ప్రసంగంలో ఆ అంశాన్ని ప్రస్తావించారు. తుపాను నుంచి 14 నెలల్లో తేరుకుని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ఆతిథ్యమిచ్చిన భారత నౌకాదళాన్ని, నగర ప్రజలను ఆయన అభినందించారు. అయితే, ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని అన్ని వర్గాలు అంటున్నమాట. హ్యాట్సాఫ్ టు ఆల్!

చేతులు మారి..ప్రధాని తలపైకి చేరిన టోపీ!
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ప్రతి బియ్యపు గింజమీద దాన్ని తినే వ్యక్తిపేరు రాసి ఉంటుందని అంటారు. ఈ ఉదంతం కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది. ఫ్లీట్ రివ్యూ తిలకించేందుకు ప్రధాని మోదీ ఆదివారం ఆర్‌కె బీచ్‌కు వచ్చారు. ఆయన ఫ్లీట్ రివ్యూ, సిటీ పెరేడ్ తిలకించినప్పుడు విధిగా తలకు టోపీ ధరించాలి. అయితే, సిబ్బంది ఎవ్వరూ టోపీని అక్కడ ఉంచలేదు. దీంతో కలవరపడిన అధికారులు దాన్ని ఎలాగైనా సంపాదించాలని అటూ..ఇటూ తిరుగుతున్నారు. వెంటనే ఈ విషయాన్ని గమనించి సతీష్ సోనీ సతీమణి అటు..ఇటూ చూసి నేవల్ కమాండర్ రాజు దగ్గర ఉన్న టోపీని తీసుకురావల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. వెంటనే ఆయన వచ్చి టోపీని తీసుకువెళ్లి ఆమెకు అందచేశారు. ఆమె దాన్ని తీసుకువెళ్లి ప్రధాని కూర్చునే వేదిక వద్దకు వెళ్లారు. ప్రధాని ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ తిలకించినప్పుడు ఆ టోపీ పెట్టుకున్నారు. దీంతో కమాండర్ రాజు ఆశ్ఛర్యానికి గురయ్యారు.

ఫ్లీట్ రివ్యూ సక్సెస్
* నగర అందాలకు మంత్రముగ్దులైన విదేశీయులు
* యంత్రాంగం కృషికి సర్వత్రా ప్రశంశలు
* మెచ్చుకున్న చంద్రబాబు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) కొద్ది రోజులుగా నగరంలో ఏ అధికారిని కదిలించినా ఇదే మాట. అయితే ఐఎఫ్‌ఆర్‌కు వచ్చిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ సహా ప్రముఖులంతా ఏర్పాట్లపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడం అధికారుల శ్రమను మర్చిపోయేలా చేసింది. నవ్యాంధ్రలో మొదటి సారిగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం రేయింబవళ్లు శ్రమించింది. దాదాపు ఆరు నెలల ముందు నుంచే ప్రణాళిక ప్రకారం నగరంలో ఏర్పాట్లతో పాటు సుందరీకరణ పనులను చేపట్టారు. సుమారు రూ.112 కోట్లతో రహదార్ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, సుందరీకరణ తదితర పనులను చేపట్టి పూర్తి చేశారు. పదిహేనేళ్ల కిందట ముంబై కేంద్రంగా జరిగిన ఈ అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు తాజాగా విశాఖ వేదిక కావడం యంత్రాంగంలో టెన్షన్ తెప్పించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఆర్థిక చేయూతతో యంత్రాంగం ముందుకు సాగింది. ముఖ్యంగా నగరంలో చేపట్టిన రహదార్ల నిర్మాణం, సుందరీకరణ పనులను మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి), విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)తో పాటు పోర్టుట్రస్టు, తదితర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సైతం పాలుపంచుకున్నాయి. రహదార్ల విస్తరణ, అభివృద్ధి, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్ల నిర్మాణంతో పాటు విద్యుదీకరణ, సుందరీకరణ పనులకు జివిఎంసి సుమారు 85 కోట్లను వెచ్చించింది. దీనితో పాటు ఫ్లీట్ రివ్యూ జరిగే ఆర్‌కె బీచ్ సహా ప్రధాన రహదార్లపై బారికేడింగ్, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పన, విద్యుత్ దీపతోరణాల ఏర్పాటు వంటి పనులకు మరో రూ.10.39 కోట్లను వెచ్చించారు. నగరం అంతటా అందాలు విరజిమ్మేలా హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. అలాగే వుడా మరో 2.73 కోట్లు, పర్యాటక శాఖ రూ.3.15 కోట్లు వెచ్చించింది. నగరంలో ట్రాఫిక్ నియంత్ర, బందోబస్తు ఏర్పాటుకు పోలీసు శాఖ రూ.9.87 కోట్లు ఖర్చు చేసింది. జివిఎంసి పరిధిలోని 63 కిలోమీటర్ల మేర రహదార్లను రూ.44.43 కోట్లతో విస్తరించగా, 44కిమీ ఫుట్ పాత్‌లను రూ.20.03 కోట్లతో అభివృద్ధి పరిచారు. రాత్రి వేళల్లో నగర అందాలకు మరింత శోభను చేకూర్చేందుకు రూ.1.6 కోట్లతో హైమాస్ట్‌లైట్లను, రూ.3.14 కోట్లతో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. నౌకాదళ విన్యాసాలను తిలకించేందుకు వీలుగా నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద 25 ఎల్‌ఇడి తెరలను ఏర్పాటు చేశారు. ఫ్లీట్ వివ్యూను స్వయంగా తిలకించేందుకు వచ్చే సందర్శకులకు యంత్రాంగం 72 ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేయగా, వారిలో మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించారు. ఇక నగరంలోని 42 సినిమా థియేటర్లలో ఫ్లీట్ రివ్యూను తిలకించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సైతం విస్తృత బందోబస్తు నిర్వహించారు. సుమారు 15వేల మంది పోలీసులు ఐఎఫ్‌ఆర్ బందోబస్తులో పాలుపంచుకున్నారు. మూడు రోజుల పాటు రాష్టప్రతి, ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్ తదితర ప్రముఖులు నగరంలోనే ఉంటూ ఐఎఫ్‌ఆర్ వేడుకలను ఆస్వాదించారు. సిఎం చంద్రబాబు నగర అధికారుల శ్రమను గుర్తించి ప్రశంసలందించారు.

నగరం దిగ్భంధం
* ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జాం
* బారులు తీరిన వాహనాలు
* పోలీసుల అతితో మరిన్ని ఇబ్బందులు
* కాలినడకనే సందర్శకుల చేరిక
* పాస్‌లు ఉన్నా తప్పని ఇబ్బందులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ట్రాఫిక్ పద్మవ్యూహంలో నగరం అష్టదిగ్భంధనమైంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను తిలకించేందుకు వచ్చే వారితో విశాఖ జనసంద్రమైంది. అంతర్జాతీయ స్థాయి వేడుకలను తిలకించేందుకు జనం సాగరతీరానికి దారితీయడంతో నగర రోడ్లన్నీ కిక్కిరిసాయి. ఫ్లీట్ రివ్యూపై గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరగడంతో జనాల్లో ఉత్కంఠ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ ట్రాఫిక్ విషయంలో తడబాటు తప్పలేదు. ప్రముఖుల భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణ తదితర అంశాల్లో పోలీసులు కొంతమేర అతిగా వ్యవహరించారు. ట్రాఫిక్‌ను మళ్లించే ప్రక్రియ పలు విమర్శలకు దారితీసింది. ఈ నిబంధనలు సందర్శకులకు తలనొప్పిగా పరిణమించాయి. పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాస్‌లు ఉన్న వారు ఇబ్బందులకు గురి అయ్యారు. పాస్‌లు ఉన్న వారు వెళ్లేందుకు అనుమతించిన రహదారుల్లో వెళ్లే ప్రాంతాల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. దాన్ని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఫ్లీట్ రివ్యూ చూసేందుకు ఎరుపు, నీలం రంగు పాస్‌లను మీసేవా కేంద్రాల ద్వారా జారీ చేశారు. ఎరుపు రంగు పాస్‌లను సిరిపురం ప్రాంతం నుంచి, నీలం రంగు పాస్‌లను కలెక్టరేట్ ప్రాంతం నుంచి అనుమతించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రహదారులపై బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లైఓవర్ మీద నుంచి వాహనాల రాకపోకలను అనుమతించలేదు. ఫ్లైఓవర్ కింద నుంచి వాహనాలను ఆశీలుమెట్ట మీదగా రామాటాకీస్, బుల్లయ్య కళశాల జంక్షన్ మీదుగా మళ్లించారు. సాధారణ ట్రాఫిక్‌కు సందర్శకుల ట్రాఫిక్ తోడవడంతో బుల్లయ్య కళాశాల జంక్షన్ వద్ద సిరిపురం వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహన చోదకులను పాస్‌లను చూపించమని ఆపుతుండటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు కొద్ది సేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. జంక్షన్ వద్ద రెండు వైపులా వాహనాలు బారులు తీరాయి. ఫ్లైఓవర్ వద్ద కూడా వాహనాలను అనుమతించకపోవడంతో కొంతమంది పోలీసులతో వాదనకు దిగడం కనిపించింది. పోలీసులు సర్ది చెప్పి ట్రాఫిక్‌కు అవరోధం కలుగుకుండా చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా ఒక్కసారిగా జనాలు బీచ్ రోడ్డు నుంచి బయటకు రావడంతో రోడ్లపై విపరీతమైన రద్దీ నెలకొంది. అయితే రాత్రి 10 గంటల సమయానికి నగరంలో ట్రాఫిక్ పూర్తిగా అదుపులోకి వచ్చింది.

ఐఎఫ్‌ఆర్‌పై పోస్టల్ పుస్తకావిష్కరణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: అంతర్జాతీయ యుద్ధనౌకాదళ సమీక్ష (ఐఎఫ్‌ఆర్)లో భాగంగా పోస్టల్ శాఖ ఐక్య పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఆదివారం ఎయు ప్లాటినం జూబ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టల్ సర్వీసెస్ బోర్డు సభ్యుడు ఎస్‌కె సిన్హా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ నిర్వహిస్తున్న ప్రతీ ఐఎఫ్‌ఆర్‌లోను తాము విన్యాసాలపై పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనవాయితీగా మారిందన్నారు. ఈ ఏడాది కూడా ఐఎఫ్‌ఆర్‌కు పుస్తకాన్ని ఆవిష్కరించామని వివరించారు. 1984, 89 2001 2006 2011 సంవత్సరాల్లో నిర్వహించిన ఐఎఫ్‌ఆర్‌లలో ఇటువంటి పుస్తకాలను ప్రచురించామన్నారు. వీటిలో నావికాదళ విన్యాసాలు, ఐఎఫ్‌ఆర్ విశిష్టత గురించి వివరించామని చెప్పారు. వీటితోపాటు ఫ్లీట్ రివ్యూ అంశాలు, స్టాంపులకు సంబంధించి చిత్రాలు ఇందులో పొందుపరిచామన్నారు. అలాగే సెరిమోనియల్ చార్ట్‌లను కూడా ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఐఎఫ్‌ఆర్‌లోను రాష్టప్రతి పేరిట స్టాంపును విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సందర్భంగా రాష్టప్రతి పేరిట స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంపులో ఐఎన్‌ఎస్ చక్ర, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, సబ్‌మెరైన్‌లకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. కాగా, ఐక్య పుస్తకాన్ని రూపొందంచడంలో నేవి అధికారి దొరబాబు, ఎవిఎస్‌ఎస్ మూర్తి కృషి చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేవి అధికారి అమిత్ విక్రమ్, చీఫ్ పోస్టల్ సభ్యులు శారద సంపత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సర్కార్ నిర్లక్ష్యం
* ప్రజా పోరాటాలకు సన్నద్ధం
* ఎమ్మెల్సీ ఎంవివి శర్మ
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: పూర్తిగా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడం కోసం మళ్ళీ ప్రజాపోరాటాలు నిర్వహించక తప్పదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక వైస్-చైర్మన్, ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ అన్నారు. హెచ్‌బి కాలనీ ఆయన స్వగృహంలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధులు ఇటీవల ప్రభుత్వ అతిథిగృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేసామన్నారు. ఈ సందర్భంగా సిఎం చేసిన వ్యాఖ్యాలు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గాయపరిచేలా ఉన్నాయన్నారు. ప్రాంతాల వారీ ప్రజలను చీల్చుతున్నట్టు, అస్థిరతను సృష్టిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉందని కేంద్రమే రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొనగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చట్టంలోనే పేర్కొందన్నారు. అలా వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరితే, అందుకు సిఎం అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. అభివృద్ధి కోరడం అస్థిరతకు కారణం ఎలా అవుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అవసరంలేదని, తమ ప్రభుత్వమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేస్తుందని ముఖ్యమంత్రి అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గత 20 మాసాల కాలం9 ఏం అభివృద్ధి చేశారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత రెండు బడ్జెట్లలోను ఎంత కేటాయించారు? ఎంత ఖర్చుచేశారు? మొత్తం ఇరిగేషన్ బడ్జెట్‌లో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఖర్చు చేసింది ఎంత శాతం? అంటూ వరుస ప్రశ్నలు వేశారు. అలాగే స్టీల్‌ప్లాంట్‌కి గనులు కేటాయించనేలేదని, విశాఖకు రైల్వేజోన్ ఇచ్చే విషయం తేలలేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజయ్‌శర్మ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో మూతపడిన పరిశ్రమలను ఎన్నింటిని తెరిపించిందని ప్రశ్నించారు. విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంరభం కానేలేదని, కెజిహెచ్‌లో చేసిన అభివృద్ధి ఏమిటన్నారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనకు ఇక్కడ ఏర్పర్చే పరిశ్రమల్లో చర్యలే తీసుకోలేదని, వంద రోజుల్లోనే పరిష్కరిస్తామని ప్రకటించిన పంచ గ్రామాల (సింహాచలం) భూ సమస్యలపై ఏం చేశారని, ఉద్దానం కిడ్నీ వ్యాధుల బాధితులకు పరిష్కారం ఏం చూపారన్నారు. ఏయు మాజీ వైస్-్ఛన్సలర్, వేదిక చైర్మన్ కెవి రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యాన్ని, ప్రజల ఉద్యమాలపై అసహనాన్ని వదిలిపెట్టి, ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ ఎంత? ఎంత విడుదలైంది? ఎంత ఖర్చు అయ్యిందనేవి స్పష్టంచేయాలన్నారు. ఐటి రంగంలో కొత్తగా ఎందరికీ ఉద్యోగాలు కల్పించారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో అభివృద్ధి వేదిక కోశాధికారి బిబి గణేష్ పాల్గొన్నారు.

అమ్మో ఐఎఫ్‌ఆర్...
* జగదాంబ జంక్షన్‌తో నిలిచిన సిటీలు
* పాదచారులకు లేని అవకాశం
* అడుగడుగునా పోలీసుల అడ్డు
* సిటీ సర్వీసుల దారి మళ్ళింపు
* పలుచోట్ల తొక్కిసలాట
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)ను వీక్షించడం మాట ఎలా ఉన్నా అసలు సమీపంలోకి కూడా వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పాదచారులు సైతం ఐదు కిలోమీటర్ల దూరం నుంచే వెనుదిరాగాల్సి వచ్చింది. ఇక ఆర్టీసీ సిటీ బస్సుల సంగతి చెప్పనక్కర్లేదు. ఇవి ఏ రూట్‌లో ఏ విధంగా నడుస్తున్నాయో? ఇటు ప్రయాణికులకు, చివరకు ఆర్టీసీ సిబ్బందికి సైతం తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి నిర్వహణ గందరగోళంగా మారింది. మధురవాడ నుంచి పాతపోస్ట్ఫాసుకు వెళ్ళే సిటీ సర్వీసులన్నీ మద్దిలపాలెం వరకు వస్తున్నాయి. ఇక్కడ నుంచి హైవే మహీంద్రటెక్, రామాటాకీసు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంటున్నాయి. అక్కడ నుంచి సిఎంఆర్ పక్క నుంచి డాబాగార్డెన్స్‌కు చేరుకుని సరస్వతిపార్కు, డాల్ఫిన్ హోటల్, పోలీస్ బ్యారెక్స్ మీదుగా సూపర్‌బజార్, పాతపోస్ట్ఫాసుకు చేరుకున్నాయి. దీనివల్ల జగదాంబ జంక్షన్‌కు చేరుకోవాల్సిన వారంతా మార్గ మధ్యలో దిగి కాలినడకనే వెళ్ళాల్సి వచ్చింది.
* పాదచారులు జగదాంబ జంక్షన్‌తో సరి
కాలినడకను బీచ్‌కు చేరుకోవాలనుకునే వారికి పోలీసుల నుంచి తీవ్ర అడ్డంకులు ఎదురయ్యాయి. జగదాంబ జంక్షన్ వద్ద బీచ్‌కు వెళ్ళే ప్రతి మార్గం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం, బారికేడ్లను అడ్డుగా ఏర్పాటు చేయడంతో పాదచారులు సైతం వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మహిళలు,వృద్ధులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మరోపక్క బీచ్ సమీపంలోకి వెళ్ళి వీలులేని పరిస్థితులు కాలినడకను తిరుగు ముఖం పట్టిన వందలాది మంది పాదచారులు జగదాంబ జంక్షన్ వద్దకు చేరుకోవడంతో ఊపీరిపీల్చుకున్నారు. అయితే జగదాంబ జంక్షన్, కలెక్టరేట్, కోస్టల్ బ్యాటరీ, జెడ్‌పి జంక్షన్ల వద్ద జనం రద్దీతో తొక్కిసలాట ఏర్పడింది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నగర నలుమూలల నుంచి సిటీ బస్సుల ద్వారా తరలివచ్చిన వారంతా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు జగదాంబ జంక్షన్ వద్దనే నిరీక్షించాల్సి వచ్చిన ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. దీంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అయితే వన్‌టౌను, డాబాగార్డెన్స్, అల్లిపురం, మహారాణిపేట తదితర ప్రాంతవాసులంతా సమీపంలో థియేటర్లలో ప్రదర్శనకు తరలివెళ్ళడం, మరికొంతమంది ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా ఐఎఫ్‌ఆర్‌ను తిలకించడంతో సంతృప్తి చెందారు.

జివిఎంసి ఎన్నికలు తక్షణమే జరిపించాలి
* సిపిఐ డిమాండ్
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికల కాలపరిమతి పూర్తయి మూడేళ్ళు కావస్తున్నా టిడిపి సర్కార్ వీటిని నిర్వహించకపోవడం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నగర కార్యవర్గసభ్యులు జి.వామనమూర్తి పేర్కొన్నారు. సిపిఐ హెచ్‌బి కాలనీ శాఖా సభ్యుల సమావేశం కృష్ణా కాలజే ఆటోడ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. దీనికి పార్టీ నాయకులు కె.సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడుతూ కేంద్రం నుంచి గ్రేటర్ విశాఖకు రావాల్సిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులు మరుగునపడి దీనిపై ఆర్ధిక భారం పడుతోందన్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో అనేక రూపాల్లో పన్నుల భారాన్ని వేస్తున్నారన్నారు. ఇళ్ళ కొళాయిలకు మీటర్లను అమర్చి జనం నెత్తిన భారీగా ఆర్ధికబారాలు వేస్తోందన్నారు. వీధి పోరాటాలకు ప్రజలను సమీకరించి సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శాఖ కార్యదర్శి రుంకాన అప్పన్న, సహాయ కార్యదర్శి పడాల గోవింద్, హరీష్, లంకా గోవింద్, లక్ష్మణరావు, నక్కేల అప్పలనాయుడులు పాల్గొన్నారు.

ఆయుర్వేదంలో మూలికా వైద్యం
* ‘మీ చేతుల్లో మీ ఆరోగ్యం’ పుస్తకావిష్కరణ
విశాఖపట్నం, (కల్చరల్) ఫిబ్రవరి 7: ఆయుర్వేదంతో పంచతత్త్వాలు పంచ భూతాలు త్రిదోషాలు కలిగిన పాంచ భూమికమైన దేహాన్ని కావపడటం ఎలాగో తెలియజేసేదే ఈ మూలికా వైద్యం గ్రంథం ‘మీ చేతుల్లో మీ ఆరోగ్యం’ అంటూ గ్రంధ రచయిత సోమిరెడ్డి పుస్తకావిష్కరణ సభలో అధ్యక్షునిగా వ్యవహరించిన ఆకాశవాణి సంచాలకులు ఏ.మల్లేశ్వరరావు తెలిపారు. ఆదివారం విశాఖ పౌరగ్రంథాలయంలో విశాఖ రచయితుల సంఘం రచయిత టి.సోమిర్డె రచించిన ఆయుర్వేద పుస్తకం మీచేతుల్లో మీ ఆరోగ్యం గ్రంథావిష్కరణ సభ జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ వైద్య నిపుణులు డాక్టర్ మోటూరి శ్రీరామకృష్ణ తన ప్రసంగంలో రచయిత ఆయుర్వేద సిద్దాంత ప్రకారం, మానవదేహం పనిచేసే విధానం, ఎవరిది వారికి విడివిడిగా ఉంటుందని చెప్పడమే వారి రచనా నైపుణ్యానికి గొప్ప నిర్వచనంగా పేర్కొన్నారు. పుస్తక సమీక్షకులుగా ప్రముఖ చిత్రకారులు బాలి మాట్లాడుతూ ఆహారం, ఆలోచన, ఆచరణ అనే జీవనత్రయం ద్వారా ఆరోగ్యం సాధించవచ్చు. రచయిత అదేలా ఆచరించాలో చెప్పారు. వ్యాయామం చేస్తూ, లంఖణం పరవౌషధం అని చెప్పారు. విశాఖ రచయితుల సంఘం కార్యదర్శి అడపా రామకృష్ణ సభకు స్వాగతం పలుకుతూ వైద్య విధానాలు, నాణ్యతా ప్రమాణంపై శాస్ర్తియ పరిశోధనలు జరగాలని కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంగా ఉందని తెలిసిందన్నారు. రచయిత టి.సోమిరెడ్డి స్పందిస్తూ ఆయుర్వేదానికి ఆద్యులు గిరిజనులని చరక సంహితం, మొట్టమొదటి వైద్య గ్రంథం అని అన్నారు. ఈ సభకు ఆత్మీయ అతిథిగా మేడా మస్తాన్‌రెడ్డి, ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో అనేక మంది హాజరయ్యారు. చివరిగా సంస్కృతి సంపాదకులు శిరేల సన్యాసిరావు సభకు వందన సమర్పణతో సభ ముగిసింది.

దేవాలయ వ్యవస్థలో సమూల మార్పులు
* ఆస్తుల వివరాల పట్టిక ప్రదర్శన
* భక్తులవద్దకే భగవంతుడి ఆశీస్సులు
* ఉగాది నుండీ శ్రీకారం
* మంత్రి మాణిక్యాలరావు వెల్లడి
సింహాచలం, ఫిబ్రవరి 7: దేవాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధమైందని, పారదర్శకమైన పరిపాలన అందించడంతో పాటు భగవంతుడిని భక్తులకు మరింత చేరువ చేసే విధానాలను ఉగాది పండుగ నుండి ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. ఆదివారం ఆయన సింహాచలేశుని దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. దేవాలయాల్లో ఆస్తుల వివరాలు వెల్లడించడంలో భాగంగా సక్రమ కౌలుదారులు, అక్రమ కబ్జాదారుల పేరులతో పట్టిక తయారుచేసి దేవాలయాల వద్ద ప్రదర్శిస్తామని (బోర్డులు ఏర్పాటు) ఆయన చెప్పారు. న్యాయస్థానంలో ఉన్న కేసుల వివరాలు నెంబర్లతో సహా వెల్లడిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాలు గుర్తించామని ఆయన అన్నారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో భాగంగా మరో లక్ష ఎకరాలు వెలుగులోకి వచ్చాయని ఆయన చెప్పారు. కొన్ని వేల ఎకరాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని ఆయన చెప్పారు. కబ్జాదారుల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు కూడా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. వెబ్‌సైట్ కూడా ఉగాదికి అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అన్నారు. ‘్భక్తులవద్దకే భగవంతుడి ఆశీస్సులు’ కార్యక్రమం ద్వారా ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతామని, హిందూ ధర్మాన్ని ఆచరించేవారి ఇళ్లకు దేవాలయ అర్చకులు ఉద్యోగ బృందాలను పంపించి జనన, వివాహం, సీమంతం, నామకరణం, సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. మరణానంతరం 12వ రోజు ఇళ్లలో జరిగే శుద్ధి కార్యక్రమాన్ని శివుడి అభిషిక్త జలం ద్వారా శైవాగమ దేవాలయ అర్చకులతో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఉగాది కొత్త సంవత్సరంలో సరికొత్త మార్పులు రానున్నట్లు ఆయన ప్రకటించారు. ఒకప్పుడు మానవుడి జీవన ప్రక్రియంతా దేవాలయ కేంద్రంగానే జరిగేదని, ఆ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

సింహాచల క్షేత్రంలో ప్రముఖుల సందడి
సింహాచలం, ఫిబ్రవరి 7: దేశ విదేశాల నుండి తరలివచ్చిన ప్రముఖులతో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం సందడిగా మారింది. ఉదయం నుండి సాయంత్రం వరకు వరుసగా వస్తున్న విఐపిలతో దేవస్థానం అధికారులు, అర్చకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, సిద్ధా రాఘవరావు, పల్లె రఘునాథరెడ్డి, డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ వై శ్రీనివాస శేషసాయిబాబు, ఎంపి అవంతి శ్రీనివాస్, కె గీత, ఆధార్ డెప్యూటీ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, కేంద్ర హోం శాఖ సైంటిఫిక్ అడ్వైజర్ జి సురేష్‌రెడ్డి, జైళ్ల శాఖ డిఐజి రామచంద్రారెడ్డి, అదనపు డిజిపి కౌముది, తెలంగాణ ఐజి సౌమ్యామిశ్రా, తెలంగాణ కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద, ముంబైకి చెందిన మొజాన్ డాన్ ఎండి ఆర్‌కె శ్రావత్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులతో పాటు విదేశాలకు చెందిన నావికాదళ ప్రతినిధులు, అధికారులు పెద్ద మొత్తంలో వచ్చి సింహాచలేశుని సేవలో తరించారు. దేవాలయ అధికారులు ప్రోటోకాల్ అనుసరించి మర్యాదలు చేశారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు ఆస్థాన మండపంలో ప్రముఖులను ఆశీర్వదించారు.

ఇ-ప్రగతితో దక్షిణాసియాలో నెంబర్ 1 కానున్న ఎపి
* ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి
సింహాచలం, ఫిబ్రవరి 7: ఇ-ప్రగతి ద్వారా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం దక్షిణాసియాలోనే అగ్రస్థానంలో నిలవనున్నదని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన సింహగిరిపై విలేఖరులతో మాట్లాడారు. ఏ రంగమైనా అభివృద్ధి, పారదర్శకత కావాలంటే సాఫ్ట్‌వేర్ మేలవింపు జరగాలని ఆయన చెప్పారు. ఇ-ప్రగతి సాధించేందుకు రాష్ట్రం విశేషంగా కృషి చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 30 వేల గ్రామాలకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించేందుకు పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. కాగిత రహిత పాలన అందించేందుకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. 80 లక్షల మంది రైతులు, 70 లక్షల మంది డ్వాక్రా సంఘాలు 94 లక్షల పింఛన్ల వివరాలు వెబ్‌సైట్లలో దాగివున్నాయని ఆయన తెలిపారు. దేవాలయాల్లో కూడా ఇ-ప్రగతి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు భగవంతుడి సేవలు శీఘ్రంగా పొందే అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. విశాఖపట్నం పారిశ్రామికంగా, ఆర్థిక ఐటి హబ్‌గా అభివృద్ధికి అనువైనదని ఆయన చెప్పారు. అన్ని వనరులు పుష్కలంగా ఉన్న విశాఖ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని మంత్రి అన్నారు. ఇప్పటివరకు 68 ఎల్‌ఒఎలు వస్తే అందులో 70 శాతం విశాఖకే ఆసక్తి చూపాయని ఆయన చెప్పారు. మధురవాడ ఫేజ్2లో డినోటిఫై చేయడం జరిగిందని ఆయన తెలిపారు. హైపవర్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం కూడా జరిగిపోయిందని సిగ్నేచర్ టవర్‌కి టెండర్లు పిలిచామని ఆయన చెప్పారు. అన్ని విధాలా విశాఖపట్నం అభివృద్ధి సాధిస్తుందని ఆయన అన్నారు.

సభ హుందాతనం నిలబెట్టడం అందరి బాధ్యత
* నైతిక విలువ సంఘం చైర్మన్, డెప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్
సింహాచలం, ఫిబ్రవరి 7: శాసనసభ హుందాతనం నిలబెట్టడం అందరి బాధ్యత అని రాష్ట్ర నైతిక విలువల సంఘం చైర్మన్, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మడలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన సింహాచలేశుని దర్శనం చేసుకున్న అనంతరం కలిసిన విలేఖరులతో మాట్లాడారు. సభలో సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేశకావేశాలు క్షణికమైన పొరపాట్లు సరిదిద్దుకోవలసిన బాధ్యత సభ్యులపై ఉంటుందని ఆయన చెప్పారు. వ్యక్తిగత నిందాపూరిత విమర్శలు, పరుష, అసభ్యపదజాలం వాడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రజలు మనల్ని గమనిస్తున్నారన్న ఆలోచన కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ఆయా పార్టీల నేతలు తమ సభ్యులను నిలువరించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక విలువల సంఘం తరఫున తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో సమావేశాల ఏర్పాటు, అభిప్రాయాలు సేకరించామని, ఈ మేరకు ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీల పరిస్థితి సభలో ఒకేలా ఉందని ఆయన చెప్పారు. సభ సజావుగా సాగించేందుకు అన్ని పక్షాలు సహకరించాలని ఆయన కోరారు.

నేడు సింహాచలేశుని నౌకా విహారోత్సవం
సింహాచలం, ఫిబ్రవరి 7: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి నౌకా విహారోత్సవం (తెప్ప తిరునాళ్ళు) సోమవారం కొండ దిగువ వరాహ పుష్కరిణిలో జరగనుంది. సింహాద్రినాథుడు గోపాలకృష్ణుడి అవతారంలో ఉభయ దేవేరులతో కలిసి హంసవాహనంలో విహరించనున్నారు. ఇందులో భాగంగా దేవస్థానం ఇఒ రామచంద్రమోహన్, కార్యనిర్వాహక ఇంజనీర్లు శ్రీనివాసరాజు, వెంకటేశ్వరరాజు, మల్లేశ్వరరావు ఆదివారం పుష్కరిణిలో స్వామివారు విహరించే వాహనంతో ట్రైల్న్ నిర్వహించారు. వాహనంలో ప్రత్యేక మండపం, సింహాసనం ఏర్పాటు చేశారు. భక్తులు ఉత్సవం వీక్షించేందుకు వీలుగా పుష్కరిణి గట్టుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను సిద్ధం చేస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవం అనంతరం స్వామివారు సర్వజన మరోరంజని వాహనంలో తిరువీధికేగనున్నారు.

దిమిలిలో విషాదఛాయలు
* ట్రాక్టర్ బోల్తా ఘటనలో ముగ్గురు మృతి
యలమంచిలి (రాంబిల్లి), ఫిబ్రవరి 7: రాంబిల్లి మండలం దిమిలికి చెందిన వ్యవసాయ కూలీలు ముగ్గురు ఆదివారం ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి. ఈ దుర్ఘటనలో దిమిలి వాసులైన మృతులు శానపతి సత్యనారాయణ, బండి రాము, సుందరపు రమణారావు కుటుంబ భారం మోస్తున్న వ్యక్త్తులు కావడంతో ఈ కుటుంబాలు వీధినపడ్డాయి. సత్యనారాయణకు ఇద్దరు పిల్లలు, భార్య ఉంది. రాముకి ముగ్గురు పిల్లలు, భార్య ఉంది. రమణారావుకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయ, ఉపాధి పనులు చేసుకునే వీరిలో కుటుంబ పెద్దలు చనిపోవడంతో పోషణ కరవై రోడ్డున పడ్డాయి. కాగా, మూడేళ్ల కిందట పిడుగుపాటుకు వరినాట్లు వేస్తున్న దిమిలికి చెందిన ముగ్గురు మహిళులు మృత్యువాత పడిన సంఘటన నాటి విషాదంతో మళ్లీ దిమిలిలో తొంగి చూసింది. అప్పటిలో ఐదుగురు వ్యవసాయ కూలీల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరి కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం ఇప్పటికీ అందకపోవడం విచారకరం.
వివరాల్లోకి వెళితే.. యలమంచిలికి చెందిన ఒకరు, దిమిలికి చెందిన నలుగురు వ్యవసాయ కూలీలు ఆదివారం ఉదయం దిమిలిలో ట్రాక్టర్‌పై రాజకోడూరులో వరికుప్పను నూర్చడానికి బయలుదేరారు. వీరు ప్రయాణీస్తున్న ట్రాక్టర్ మార్గమధ్యలో పంచదార్ల సమీపంలో రాజకోడూరు రోడ్డులో మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ ఇంజన్‌పై ఉన్న కూలీలు శానపతి సత్యనారాయణ(36), బండి రాము(40), సుందరపు రమణారావు(42)లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు బండి అప్పారావు(35), డ్రైవర్ గొర్లి నాయుడు(40) తీవ్రంగా గాయపడ్డారు. యలమంచిలి సిఐ కె. వెంకట్రావు, రాంబిల్లి ఎస్‌ఐ కుమారస్వామి అక్కడకు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను యలమంచిలి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల బంధువులకు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎస్‌ఐ కుమారస్వామి దర్యాప్తు చేస్తున్నారు.
నాయకుల పరామర్శ : ట్రాక్టర్ బోల్తా ఘటనలో మృతి చెందిన మూడు కుటుంబాలను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, వైకాపా నాయకుడు ప్రగడ నాగేశ్వరరావు వేర్వేరుగా వెళ్లి పరామర్శించారు. దుఃఖంలో నిండి ఉన్న శానపతి సత్యనారాయణ, సుందరపు రమణారావు, బండి రాము కుటుంబాలను ఓదార్చారు. కూలీ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు జరిగిన ఘటనతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డామని బోరున విలపించారు. మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయం అందించి అండగా నిలుస్తానని ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. వైకాపా సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని కోరారు. నిరుపేదలైన కూలీల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ ఆపద్బంధు పథకం వర్తింపచేసి నిరాశ్రయులైనవారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, పంచదార్ల సర్పంచ్ వి.దిన్‌బాబు, కొటారు సాంభ, ఏదూరి త్రిమూర్తులు పాల్గొన్నారు.
రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి
* పిఆర్ చీఫ్ ఇంజనీర్ మూర్తి ఆదేశం
నర్సీపట్నం, ఫిబ్రవరి 7: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌శాఖ చీఫ్ ఇంజనీర్ సివిఎస్ మూర్తి ఆదేశించారు. ఆదివారం స్థానిక పిఆర్ కార్యాలయంలో నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట డివిజన్ల అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారి పనులకు నిధుల కొరత లేదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అధిక శాతం నిధులు రహదారుల నిర్మాణాలకే కేటాయించామన్నారు. జిల్లాకు 92 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. నర్సీపట్నం నియోజకవర్గానికి 148 రోడ్లకు రూ.5.31కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు 64 పనులకు 2.04 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. పనుల్లో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈఏడాది ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి ము