విశాఖపట్నం

ఇక కదలికలే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూన్ 13: అంతా జరిగిపోయింది... ఇంతలోనే అయోమయం... గత కొద్దిరోజులుగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై స్పష్టమైన తేదీలు ప్రకటించేశారు. దీనికి సంబంధించిన జివో సైతం విడుదలైంది. ఎటొచ్చి దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ లేకపోవడంతో ఇప్పుడు సర్కార్ కొలువుల్లో ఉద్యోగులు అయోమయంలో పడుతున్నారు. బదిలీల ప్రక్రియ పూర్తిగా గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. ఏమీ చేయాలో తోచని స్థితిలో ఉద్యోగులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిశాఖల్లో ఏళ్ళ తరబడి పాతుకుపోయిన ఉద్యోగులను కదపడంతోపాటు శాఖల ప్రక్షాళన చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సాధారణ బదిలీల ప్రక్రియ నిర్వహించాలని భావించింది. ఇందులోభాగంగా ఇప్పటికే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏ శాఖలో ఏ ప్రాతిపదికన బదిలీలు చేయాలి? ఆన్‌లైన్ విధానమా? లేదంటే మాన్యువల్ పద్ధతా? తదితర వివరాల్లో ఎటువంటి స్పష్టత లేకపోవడం గందరగోళాన్ని సృష్టిస్తోంది.ముఖ్యంగా వైద్య,ఆరోగ్యశాఖకు నేటికి ఎటువంటి మార్గదర్శకాలు రాకపోవడంతో దరఖాస్తు చేసుకునే గడువు ముగియనుండటంతో ఏ నిమిషానికి ఏమీ జరుగుతుందోనన్న ఆందోళన ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ నెల 14వ తేదీలోపు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు పేర్కొనడంతో ఏ విధంగా దరఖాస్తు చేయాలనే స్పష్టత లేని కారణంగా అంతా ఆ శాఖ ముఖ్య ఉన్నతాధికారుల గైడ్‌లైన్స్ కోసం నిరీక్షిస్తున్నారు.
* అమాత్యుల చుట్టూ ప్రదక్షిణలు
అమాత్యుల ఆశీస్సుల కోసం ప్రస్తుతం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం పడరాని పాట్లు పడుతూ చివరకు ఇళ్ళ వద్ద తిష్టవేస్తున్నారు. అమాత్యుల దయాదక్షిణ్యాల కోసం నిరీక్షించే అనేకమంది ఉద్యోగుల్లో కొందరు ఇప్పటికే తగిన హామీలు తీసుకున్నట్టు తెలిసింది.