విశాఖపట్నం

నాణ్యమైన విద్యనందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని తమిళనాడు గవర్నర్ కోణిజేటి రోశయ్య అన్నారు. సోమవారం విశాఖ రాంనగర్ ప్రాంతంలో పి.లక్ష్మిదేవి, రంగ య్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయంతో విశాఖ సేవా సదన్ ప్రాథమిక పాఠశాలలో పునఃనిర్మించిన తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్య అన్ని చదువులకు పునాది వంటిదని, విద్యార్థులకు అవసరమైన చదువుల భారం మోపకుండా మంచి ఉన్నత ప్రయోగాలతో నాణ్యమైన విద్యనందించాలన్నారు. నేటి విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం విద్యార్ధులు తమ చదువుకు మించిన పుస్తకాల బరువును మోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తమ చిన్నతనంలో పలక, బలపం, పెద్దబాలశిక్ష ఉంటే అన్నీ ఉన్నట్టేనని భావించేవారమన్నారు. ప్రస్తుతం పాఠశాల విద్యావిదానాలు చూసి మార్పులు చేస్తున్నారని కొత్త కోర్సులు, చదువుకునే విద్యార్ధులకు మంచి క్రమశిక్షణ గల విద్యాబోదన అమలుకావాలన్నారు. వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే విధంగా ఉండాలన్నారు. పాఠశాలల్లో చదువుకునేందుకు అన్ని వౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. దీనిపై ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యాలు దృష్టిపెట్టాలన్నారు. ఛారిటబుల్‌ట్రస్టు నిర్వాహకులు సామాజిక బాధ్యతతో పాఠశాలకు అన్ని వసతులు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ సభలో దాతలు పి.లక్ష్మిదేవి, పివి రంగయ్య, ఎఎస్‌ఎన్ ప్రసాద్, గ్రంధి రాజేష్, బివి గంగరాజు, బాబా-బాపు భవన్ కార్యదర్శి రహీమున్నీషాబేగమ్, ప్రముఖ న్యాయవాది ఎంకె సీతారామయ్య, వ్యాపారవేత్తలు బొడ్డు రఘు, కంకటాల మల్లిక్, పాఠశాల ఉపాధ్యాయలు, విద్యార్ధులు పాల్గొన్నారు.