విశాఖ

మంత్రి గంటా ఇంటి ఎదుట కాపుల బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని, కాపు ఉద్యమంపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని కోరుతూ పలువురు కాపు నాయకులు రాష్ట్ర మంత్రి గంటా ఇంటి ఎదుట నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కాపు సంఘం నాయకుడు తోట రాజీవ్ నేతృత్వంలో పలువురు కాపు నాయకులు ముద్రగడ దీక్షపై గంటా వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు. ముద్రగడ దీక్ష, ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రిగా ప్రభుత్వ తీరుపై మీ వైఖరి వెల్లడించాలంటూ డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ దీక్షకు ఉపక్రమించారని, అయితే ముద్రగడ దీక్షను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆణచివేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుపై చర్చించేందుకు తమకు సమయం ఇవ్వాలని కోరిన కాపు ఉద్యమకారులతో చర్చించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు నిరాకరించడంతో పలువురు గంటా కారును అడ్డుకునే యత్నం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని, కాపు ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ముద్రగడ దీక్షపై గంటా వైఖరిని నిలదీసేందుకు సిద్ధపడిన పలువురు కాపు నాయకులను పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కాపు సంఘం నాయకుడు గుంటూరు
నర్శింహమూర్తిని ఫోర్త్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి నిర్బంధించారు. దీనిపై గుంటూరు స్పందిస్తూ ముద్రగడ దీక్షపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితులపై కాపు జాతి ఆందోళనతో ఉందని, ఈదశలో ప్రభుత్వం వారిని సమాధాన పరచాల్సి ఉందన్నారు. అయితే ప్రభుత్వం ఈ అంశంలో నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉద్రేకాల్ని రెచ్చగొడుతోందన్నారు. ఇదే తీరు కొనసాగితే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతమేర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కాపులకు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. శాంతి భద్రతల నేపథ్యంలో కొన్ని అంశాలను సున్నితంగా పరిష్కరించాల్సి ఉందన్నారు.