విశాఖ

అరకు పాసింజర్ రైలుకు రెండు అద్దాల బోగీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూన్ 14: విశాఖపట్నం నుంచి కొత్తవలస, అరకులోయ మీదుగా కిరండోలుకు వెళ్లి వచ్చే పాసింజర్ రైలుకు రెండు అద్దాల బోగీలు కేటాయిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డి.ఆర్.ఎం) చంద్రలేఖ ముఖర్జీ వెల్లడించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో 60 లక్షల రూపాయలు వెచ్చించి అత్యాధునికంగా నిర్మించిన సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (వర్క్స్, వంతెనలు, టన్నల్స్) భవనాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఖ్యాతిగాంచిన అరకులోయకు వచ్చే దేశ విదేశీ పర్యాటకులు ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలను మరింతగా ఆస్వాదించేందుకు వీలుగా అద్దాల బోగీలతో పాసింజర్ రైలును నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే అద్దాల బోగీల తయారీలో కొంత జాప్యం జరుగుతున్నందున ఈ మార్గంలో అద్దాల రైలును నడపడంలో ఆలస్యవౌతున్నట్టు ఆమె చెప్పారు. కొత్తగా మూడు బోగీలు తయారౌతున్నాయని, వీటిలో అరకు పాసింజర్ రైలుకు రెండు బోగీలు కేటాయించి, మరొకటి ఉత్తర భారత దేశంలోని ఓ పర్యాటక ప్రాంతానికి ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. ఈ నేపధ్యంలో పర్యాటక సీజన్ ప్రారంభంనాటికి అద్దాల బోగీలతో కూడిన పాసింజర్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కొత్తవలస, కిరండోలు రైలు మార్గంలో నడిచే పాసింజర్ రైలుకు ఓకేఒక అద్దాల బోగీని కేటాయించే అవకాశాలున్నట్టు వచ్చిన వందంతుల్లో వాస్తవం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. కొత్తవలస, కిరండోలు ఏకైక రైలు మార్గంలోని పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల సౌకర్యార్థం ఫ్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టామన్నారు. కె.కె.లైనులోని రైల్వే స్టేషన్లకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. రైల్వే స్టేషన్ల ఫ్లాట్‌ఫాం నిర్మాణాలతో పాటు వివిధ అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చినట్టు ఆమె చెప్పారు. కె.కె.లైను పాసింజర్ రైలు ప్రయాణంపై పర్యాటకులే కాకుండా వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆధారపడుతున్న కారణంగా అద్దాల బోగీలను ఏర్పాటు చేసి నడిపేందుకు చర్యలు తీసుకున్నట్టు ఆమె చెప్పారు. పర్యాటకుల సౌకర్యార్థం ఈ మార్గంలో ప్రత్యేక పాసింజర్ రైలును నడుపుతున్నామన్నారు. రైలు ప్రయాణీకుల సంఖ్య పెరిగితే పర్యాటక సీజన్‌లో ప్రతి రోజు ప్రత్యేక పాసింజర్ రైలును నడిపేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా కొత్తవలస, కిరండోలు రైలు మార్గంలోని రైల్వే స్టేషన్లను పరిశుభ్రతగా ఉంచుతున్నామన్నారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో క్లీన్ అండ్ గ్రీన్ పాటించాలని సిబ్బందిని ఆదేశించినట్టు ఆమె చెప్పారు. దంతెవాడ రైలు మార్గం విస్తరిస్తున్నామని, ఆ మార్గంలో డబ్లింగ్ పనులు జోరుగా సాగుతున్నట్టు చంద్రలేఖ ముఖర్జీ తెలిపారు. అనంతరం రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఎదురుగా సుమారు ఆరు లక్షల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేసిన చిన్నారుల పార్కు (చిల్డ్రన్స్)ను ఈస్ట్ కోస్ట్ వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రారంభించారు. అదేవిధంగా పిల్లల పార్కు అంతటా కలియ తిరిగి పార్కు అభివృద్ధికి కృషి చేసిన ఇంజనీరింగ్ అధికారులను అభినందించారు. మండలంలోని పద్మాపురం పంచాయతీ యండపల్లివలస పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బాలబాలికలకు ఆమె పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లను పంపిణీ చేసారు. ప్రతిరోజు పార్కును ఉపయోగించుకోవాలని విద్యార్థులను ఆమె కోరారు. ఈ పర్యటనలో ఈస్ట్ కోస్ట్ వాల్తేరు రైల్వే డివిజన్ ఇంజనీరింగ్ అధికారులు కె.్ధనుంజయరావు, జి.నాగభూషణరావు, జె.వి. కృష్ణ, రైల్వే వైద్యాధికారి, ఆర్.పి.ఎఫ్. ఎస్.ఐ., సిబ్బంది పాల్గొన్నారు.

*