విశాఖ

గంజాయిపై ఉక్కుపాదం మోపండి :కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 14: విశాఖ మన్యంలో గంజాయి సాగును సమూలంగా నిర్మూలించేందుకు ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ఎన్.యువరాజు ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎక్సైజ్, పోలీస్, రెవిన్యూ, అటవీ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గంజాయి నిర్మూలనకు పకడ్భందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏజెన్సీలో గంజాయి పట్ల ఎక్సైజ్, పోలీసు అధికారులదే బాధ్యత అన్న బావన విడనాడి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. గంజాయి సాగును గుర్తించిన వెంటనే అన్ని శాఖల అధికారులను తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గంజాయి సాగు చేసే వారిని తక్షణమ అరెస్ట్ చేయాలని, సాగుకు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. గంజాయి రవాణాను అడ్టుకోవడం కంటే దీనిని పండించకుండా చూడడమే ముఖ్యమని ఆయన అన్నారు. ఏజెన్సీలో కోట్లాది రూపాయల గంజాయి వ్యాపారం జరుగుతున్నా ఎక్సైజ్, పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం పట్ల కలెక్టర్ ఆగ్రహాం వ్యక్తం చేసారు. గంజాయి వ్యాపారం మూలాలను గుర్తించి సమూలంగా అరికట్టగలిగితే దీనిని పూర్తిగా నిరోధించవచ్చునని ఆయన చెప్పారు. ఏ ప్రాంతంలో ఎవరు ఎక్కువగా గంజాయి సాగు చేస్తున్నారో గుర్తించాలని ఆయన ఆదేశించారు. గంజాయి పంట పండిన తరువాత దానిని నాశనం చేయడం శ్రమతో కూడుకున్నదని, దీని విత్తనం నాటిన వెంటనే గుర్తించి తొలి దశలోనే దానిని నిర్మూలించాలని ఆయన సూచించారు. గ్రామ రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ బీట్ అధికారులు తమ తమ పరిధిలోని ప్రాంతాలలో గంజాయి సాగును గమనించి పోలీసు అధికారులకు తెలియచేయాలని ఆయన ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న ప్రదేశం ప్రభుత్వ, ప్రయివేట్
భూమి అనేది కూడా పరిశీలన చేయాలని, దీని సాగుకు పరోక్షకంగా సహకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. గంజాయి పండించడం చట్టరీత్యా నేరమనే విషయం గిరిజనులకు తెలిసినా అధిక ధనానికి ఆశపడి దీనిని సాగు చేస్తున్నారని, గిరిజనుల బలహీనత, అవసరాలను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మలచుకుని లాభపడుతున్నారని ఆయన అన్నారు. గంజాయి అక్రమ వ్యాపారాన్ని చేస్తున్న వారిని గుర్తించడమే కాకుండా వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఏజెన్సీలో గంజాయి సాగు చేయాలన్నా, దీని వ్యాపారం సాగించాలన్నా భయపడే రీతిలో చర్యలు ఉండాలని ఆయన అన్నారు. గంజాయికి అడ్డాగా మారిన మన్యంలో ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండరాదని ఆయన చెప్పారు. గంజాయి నిర్మూలనలో నిర్లక్ష్యంగా వ్యవరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైతే వారిపై కేసులు బనాయించేందుకు కూడా వెనుకాడబోమని యువరాజు హెచ్చరించారు. ఈ సమావేశంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్, సబ్ కలెక్టర్ ఎల్.శివశంకర్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సి.హెచ్.గోపాలక్రిష్ణ, సహాయ కమిషనర్లు ఎస్.వి.వి.ఎస్.బాబ్జిరావు, సుకేష్, చిట్టిబాబు, నాగేశ్వరరావు, డి.ఎఫ్.ఒ. ఐ.కె.వి.రాజు, ఏజెన్సీలోని అన్ని మండలాల తాహశీల్ధార్లు పాల్గొన్నారు.