విశాఖ

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని కొణతాల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 14: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మాజీమంత్రి కొణతాల రామకృష్ణ తన మద్ధతుదారులతో మండల కేంద్రమైన సబ్బవరంలో మంగళవారం ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని చేపట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఫిబ్రవరి 21న శంకుస్థాపన శిలాఫలకం వేసారు. అప్పట్లో 7500 కోట్లతో చేపట్టిన ఈ భారీ సాగునీటి ప్రాజెక్టు పనులకు ఇంతవరకు ఇసుమంతైనా కదలిక రాలేదు. ఈ విషయమై మాజీమంత్రి కొణతాల దృష్టి కేంద్రీకరించి ఇప్పటికే సిఎం చంద్రబాబును కలిసి ఈ ప్రాజెక్టును నిర్మించాల్సిన ఆవశ్యకతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఇసుమంతైనా కదలిక రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులు, మద్ధతుదారులతో మంగళవారం సబ్బవరంలో సుజల స్రవంతి పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరుతూ ఆర్‌అండ్‌బి అతిధి గృహం నుండి మద్ధతుదారులతో ప్లకార్డులు ధరించి సంబంధిత పథకం శంకుస్థాపన శిలాఫలకం వరకు ప్రదర్శన జరిపారు. గోదావరి నదీజలాలతో ఈ శిలాఫలకాన్ని శుద్ధి చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎడతెగని జాప్యంపై తమ నిరసన తెలియజేసారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను తక్షణమే ప్రారంభించాలని, తద్వారా పరిశ్రమలకు నీటితోపాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసారు. శంకుస్థాపనా శిలాఫలకం వద్ద బైఠాయించి ఈ ప్రాజెక్టును నిర్మించాల్సిన ఆవశ్యకతపై స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా గోదావరి నదీజలాలు వృథాకాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకు అందించేందుకు దివంగత సిఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ బృహత్తర పథకం అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. అప్పట్లో 700 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని సంకల్పించగా ఆయన అకాల మరణం చెందడంతో తరువాత వచ్చిన సిఎంలు ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంపై ఇసుమంతైనా దృష్టి కేంద్రీకరించలేదన్నారు. గడచిన ఏడాది క్రితం సిఎం చంద్రబాబును తాను స్వయంగా కలసి ఈ ప్రాజెక్టును నిర్మించాల్సిన ఆవశ్యకతను ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారన్నారు. అయితే ఇంతవరకు తదుపరి చర్యలు ఇసుమంతైనా కానరాలేదన్నారు. ప్రస్తుతం ఈప్రాజెక్టు వ్యయం 1500 కోట్లకు చేరిపోయిందన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు సర్వే పనులకు ప్రభుత్వం మూడు కోట్లు కేటాయించిందన్నారు. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి ఎన్ని తరాలు పడుతుందో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు మాదిరిగానే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 1500 కోట్ల నిధులను కేటాయించి సంబంధిత పనులను సత్వరమే పూర్తిచేయాల్సిన ఆవశ్యకతపై అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా తెలియజేసానన్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించడం వలన విశాఖజిల్లా పారిశ్రామిక అవసరాలతోపాటు ఈ ప్రాంతానికి చెందిన ఆరులక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతుందన్నారు. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలకు సైతం మరో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కలగనుందన్నారు. విశాఖజిల్లాలోని 18 మండలాల రైతాంగానికి సాగునీటి సమస్య ఈ ప్రాజెక్టు అమలుతో చాలావరకు పరిష్కారం కాగలదన్నారు. ఈ ప్రాజెక్టును సత్వరమే నిర్మించాల్సిన ఆవశ్యకతపై రైతులు, వివిధ వర్గాల ప్రజలకు సైతం అవగాహన పెంపొందించి వారిలో చైతన్యం పెంపొందించే కార్యక్రమానికి దశలవారీగా చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో చీడికాడ జెడ్పీటిసి సత్యవతి, పివిజి కుమార్, మాజీ జెడ్పీటిసి బొడ్డేడ సూర్యనారాయణ, అనకాపల్లి వర్తకసంఘ కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ, నర్సీపట్నం, అనకాపల్లి మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు అంకంరెడ్డి జమీలు, మలసాల కిషోర్, మునగపాక రైతు సంఘం అధ్యక్షుల ఆడారి రమణబాబు, ఆడారి అచ్చింనాయుడు, బుచ్చెయ్యపేట రైతు నాయకులు అడపా నర్సింహమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.