విశాఖపట్నం

16 తరువాతే ఎయు వీసీ నియామకం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 5: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ నియామకం ఈ నెల 16 తరువాతే జరిగే అవకాశం ఉందని క్యాంపస్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు ఐదు నెలలుగా ఇన్‌చార్జి పాలనలో కొనసాగుతుండటం తెలిసిందే. వీసీ పదవి కోసం చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎయు కాలేజ్ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ కెమికల్ విభాగానికి చెందిన ఆచార్య నాగేశ్వరరావును దాదాపు ఖరారు చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వీసీగా నియమించేందుకు ఆచార్యునిగా 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్న నిబంధన కారణంగా నియామకంలో జాప్యం చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు. మూడు సార్లు సెర్చి కమిటీ సమావేశమై మూడు పేర్లను సిఫారసు చేయగా, అందులో ఒక పేరును ముఖ్యమంత్రి ఆమోదించారని తెలుస్తోంది. త్వరలో జరుగనున్న జివిఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాగేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే 10 సంవత్సరాల అనుభవం నిబంధన సమస్యగా మారడంతో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నెల 16 నాటికి 10 సంవత్సరాలు పూర్తి అవుతుండటంతో ఆ తరువాత వీసీ నియామక ప్రక్రియ కొలిక్కిరావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతున్న ఆచార్య ఇ.ఎ నారాయణ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని భోగట్టా. రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాయలం చాలా కాలంగా ఇన్‌చార్జి పాలనలో ఉండగా, దీనికి తెరదించేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది.