విశాఖ

సి.పి. ఎస్. విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మార్చి 17: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంట్రీబ్యూటరీ పెన్షన్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని పి. ఆర్.టి.యు. ఆధ్వర్యంలో సి.పి. ఎస్. ఉపాధ్యాయ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ డి.జి.నాధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గురువారం సి.పి. ఎస్.ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పి. ఆర్.టి.యు. ఆధ్వర్యంలో పట్టణంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. శారదానగర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసి కాంప్లెక్స్, అబీద్ సెంటర్‌కు చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేసారు. అక్కడి నుండి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. అనంతరం డి.జి.నాధ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సి.పి. ఎస్. విధానం వలన ఉపాధ్యాయులు ఆర్ధికంగా నష్టపోతారన్నారు. పదవీ విరమణ అనంతరం సాంఘిక భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. లోపభూయిష్టమైన ఈవిధానాన్ని ఉపాధ్యాయ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. సి.పి. ఎస్. విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలన్నారు. ఉద్యోగులకు గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని, ఇప్పటి వరకు సర్వీస్‌లో ఉంటూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించాలని డిమాండ్ చేసారు. సి.పి. ఎస్. ఉద్యోగుల కంటి కంట్రీబ్యూషన్ నగదు మొత్తాన్ని ఆన్‌లైన్ చేయాలని, పాత పెన్షన్ విధానం వలన పొందే అన్ని ప్రయోజనాలను సి.పి. ఎస్. ఉద్యోగులకు కల్పించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని , లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఆందోళనలో సి.పి. ఎస్. జిల్లా కన్వీనర్ సి.హెచ్.రాము, డివిజన్ కన్వీనర్ రమణ, మండలాల కన్వీనర్లు సి.హెచ్. ఎం.నాయుడు ఎ. వరప్రసాద్, కె.వి. జోగారావు, బి.రాము, జి. సుబ్బారావు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.