విశాఖపట్నం

అణువిద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), జూలై 9: కొవ్వాడలో నిర్మించనున్న అణువిద్యుత్ ప్లాంట్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకించాలని ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వివేకానంద హాలులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రలో మూతపడే దిశగా ఉన్న పరిశ్రమలను అభివృద్ధి పరచాల్సింది పోయి అత్యంత ప్రమాదకరమైన అణువిద్యుత్ ప్లాంట్‌ను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుందంటే ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అణువిద్యుత్ కేంద్రం నిర్మాణమయితే వాటి ద్వారా వచ్చిన రసాయన పదార్ధాలు ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. సుమారుగా 177కిలోమీటర్ల పరిధిలో జనావాసాలన్నీ ఖాళీ చేయాలని అంతర్జాతీయ శాస్తవ్రేత్తలు ఇప్పటికే చెబుతున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నీరు లేక మూతపడే దిశగా వచ్చిందని ఈ పరిశ్రమలకు నీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలన్నారు. సుజల స్రవంతికి రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఎనిమిది కోట్ల నిధులు ఖర్చుచేస్తే ఎత్తిపోతల పథకం ద్వారా విశాఖకు తాగునీరు అందించవచ్చని, అలాగే ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందడం వలన ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు అణువిద్యుత్ కేంద్రాన్ని కొవ్వాడలో నిర్మించడానికి వ్యతిరేకించిన ఆయన నేడు ఎలా అనుమతిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అణువిద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని వ్యతిరేకించే విధంగా ఉత్తరాంధ్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ అధ్యక్షులు ఎ. బాలకృష్ణ, సిఐటియు డివిజన్ కార్యదర్శి మళ్ల సత్యనారాయణ, ఎల్‌ఐసి డివిజన్ సెక్రటరీ విఎం శాస్ర్తీ, పోస్టల్ ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు కె. మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

పథకాలపై అవగాహన అవసరం
24న విస్తృత స్థాయి అవగాహన సదస్సు
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్
అనకాపల్లి, జూలై 9: బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలపై అవగాహన పెంపొందించేందుకు తమ సంస్థ కృషిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ విశాఖజిల్లా కోఆర్డినేటర్ వి. పురుషోత్తమరాజు తెలిపారు. ఈ విషయమై గ్రామీణ జిల్లాలోని గ్రామీణుల్లో అవగాహన, చైతన్యం పెంపొందించేందుకు ఈనెల 24న అనకాపల్లి రావుగోపాలరావు కళాక్షేత్రంలో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏపి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ చెంగవల్లి ఈ సదస్సుకు ప్రధాన అతిథిగా విచ్చేస్తున్నారన్నారు. స్థానిక గాయత్రీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఇంతవరకు చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో 932 మంది లబ్ధిదారులకు విద్యా, ఆర్థిక పరమైన పథకాలను చేపట్టేందుకు 12.25కోట్లను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వెచ్చించిందన్నారు. ఇందుకుగాను 4.35కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందని, 68.75 కోట్లు బ్యాంక్‌లు రుణంగా అందజేశాయన్నారు. భారతీయ విద్యా పథకం, భారతీ స్కీమ్, చెరకా స్కీమ్, భార్గవ మ్యాచింగ్ స్కీమ్, చాణక్య స్కీమ్, ద్రోణాచార్య పథకం, వశిష్ట, కాస్యప, గాయత్రీ, గరుడ, శ్రీ శక్తి తదితర పథకాల కింద నిరుద్యోగ యువతకు రుణ సదుపాయం కల్పించడంతోపాటు పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడం, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్‌ను ఉచితంగా ఇవ్వడం తదితర సేవా కార్యక్రమాలను బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ నిర్వహిస్తుందన్నారు. బ్రాహ్మణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత పాటించే లక్ష్యంతో బ్రాహ్మణ కుటుంబాల సర్వే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న రిటైర్డ్ డిప్యూటీ డిఇవో కెవి గౌరీపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణుల జీవన విధానాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో వివిధ స్వయం ఉపాధి పథకాలను కార్పొరేషన్ రూపొందించిందన్నారు. ఈ సంక్షేమ పథకాలను అర్హులైన బ్రాహ్మణులందరూ సద్వినియోగం చేసుకోవాలనే భావనతో వారికి అవగాహన పెంపొందించేందుకు ఈనెల 24న నిర్వహించే అవగాహన సదస్సుకు బ్రాహ్మణులంతా విధిగా హాజరుకావాలని ఆయన కోరారు. అవార్డు స్వచ్చంద సంస్థ కార్యదర్శి వివి జగన్నాథరావు, అనకాపల్లి బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యదర్శి కె. పాపయ్య శాస్ర్తీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
* వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
మునగపాక, జూలై 9: తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతీ కార్యకర్త ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలను చైతన్యం తీసుకురావాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం రాత్రి మునగపాకలో జరిగిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమర్‌నాథ్ మాట్లాడుతూ ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నయవంచనకు గురిచేసారని ఆరోపించారు. నియోజకవర్గ కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేస్తే వైకాపా బలోపేతం అవుతుందని, నియోజకవర్గానికి ఇద్దరు సమన్వయకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని, ప్రతీ మండలంలో సమావేశాలు నిర్వహించేటప్పుడు ఇద్దరు సమన్వయకర్తలను ఆహ్వానించాలని మండలపార్టీ అధ్యక్షులకు ఆయన సూచించారు. తెలుగుదేశం పథకాలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం తప్పించి ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి మండలాలనుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం నాయకులు పిన్నంరాజు వాసు, మారిసెట్టి సూర్యనారాయణ, రాంబిల్లి నాయకులు చంటిరాజు, యలమంచిలి నాయకుడు బోదే పు గోవింద్, మునగపాక మండలం నాయకులు మళ్ల సంజీవరావు,మళ్ల నాగసన్యాసిరావు పాల్గొన్నారు.