విశాఖపట్నం

నగరంలో ఆధునిక చేపల మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: నగరంలో ఆధునిక చేపల మార్కెట్ నిర్మించేందుకు ఇక్కడి మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్, నర్సీపట్నం, అచ్యుతాపురం, భీమిలిల్లో కూడా చేపల మార్కెట్‌లను నిర్మించనున్నారు. నగరంలోని దండు బజార్, నెహ్రూ బజార్, గోపాలపట్నంలోని చేపల బజార్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. నగరంలో వివిధ రకాల చేపలకు డిమాండ్ ఉంది. ఆదివారం ఇతర జిల్లాల నుంచి తెచ్చి కూడా విక్రయాలు చేస్తుంటారు. అయితే చేపలను విక్రయించే ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడం గమనార్హం. రోడ్డుపైనే చేపలను ప్రొసెస్ చేసి విక్రయించడం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో చేపలను విక్రయించేందుకు వీలుగా ఆధునిక చేపల మార్కెట్‌ను మత్స్యశాఖ చేయనుంది. దాదాపు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. ఈ మేరకు నిధులు కూడా వుడాకు చెల్లించారు. ఈ మార్కెట్‌ను ఎంపివి కాలనీలో నిర్మించేందుకు ప్రతిపాదిస్తున్నారు. అవసరమై స్థలాన్ని వుడా కేటాయించాల్సి ఉంది. స్థలం కేటాయించగానే పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు ఫిషింగ్ హార్బర్‌లో కూడా ఆధునిక చేపల మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించారు. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి హార్బర్ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచడం అవససరమని గుర్తించారు. ఇక్కడ కూడా ఒక మార్కెట్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మత్స్యశాఖ ఎడి పి.కోటేశ్వరరావు తెలిపారు. నర్సీపట్నం, అచ్యుతాపురం, భీమిలిలో కూడా చేపల మార్కెట్‌లను నిర్మించనున్నారు. నగరంలోని దండు బజార్, నెహ్రూ బజార్, శ్రీహరిపురం, గోపాలపట్నంలలోని చేపల బజార్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఒక్కో మార్కెట్ నిర్మాణానికి 15 లక్షల రూపాయలు, మరమమ్మతులకు 5 లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు, జిల్లాకు సంబంధించిన స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ కింద నిధులను సమకూరుస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల పరిశుభ్రమైన వాతావరణంలో చేపల అమ్మకాలతో పాటు వ్యర్థాలను శాస్ర్తియ పద్ధతిలో నిర్వహించే వీలు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.