విశాఖపట్నం

బిఆర్‌టిఎస్ పనులు ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అసంపూర్తిగా ఉన్న బిఆర్‌టిఎస్ పనులను ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న బిఆర్‌టిఎస్ రహదారి పనులను ఆయన శనివారం పరిశీలించారు. జ్ఞానాపురం, కంచరపాలెం మీదుగా ఎన్‌ఎడి జంక్షన్ వరకూ ఆయన పరిశీలించారు. జ్ఞానాపురం డక్ట్‌లను, గ్రిల్స్‌ను, కేబుల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఊర్వశి జంక్షన్‌లో గోతులను పూడ్చాలని తెలిపారు. శివాలయం, దర్గా తదితర ప్రాంతాల్లో వివాదం కారణంగా ఉన్న ప్రాంతాలను విడిచి, మిగిలిన ప్రాంతాల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్‌ఎడి వద్ద ఫ్రీలెఫ్ట్‌ను అభివృద్ధి చేయాలని తెలిపారు. ఈ పర్యటనలో సిసిపి వెంకటరత్నం, ఎస్‌ఇ మరిడన్న, ఎసిపిలు లక్ష్మణరావ, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ సిటీలో అంబాసిడర్ల పాత్ర కీలకం

విశాఖపట్నం, మార్చి 19: నగరాన్ని స్వచ్ఛ సిటీగా తీర్చిదిద్దడంలో స్వచ్ఛ అంబాసిడర్ల పాత్ర కీలకమని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జివిఎంసి కాన్ఫరెన్సు హాల్‌లో శనివారం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు స్వచ్ఛ అంబాసిడర్లు, జోనల్ కమిషనర్లు, ఎఎంఒహెచ్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను, ప్రజలను భాగస్వాములు చేయాలని తెలిపారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఇందుకు వార్డు స్థాయి అధికారులను నియమించామని, టాస్క్ఫోర్సు కమిటీల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ విశాఖలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేయాల్సి ఉందన్నారు. రానున్న ఆరువారాల్లో బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన జరుగకుండా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సిసి కెమెరాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణను యాంత్రీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాటర్ శానిటేషన్ ప్రాజెక్టు మేనేజర్ ఉయద్‌సింగ్, ఎడిసి (జనరల్) మూర్తి, స్వచ్ఛ్భారత్ అంబాసిడర్లు షిరీన్ రెహమాన్, రమణ మూర్తి, పిఎల్‌కె మూర్తి తదితరులు ప్రసంగించారు.