విశాఖపట్నం

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎంవి కృష్ణారెడ్డి చెప్పారు. శుక్రవారం నగరంలోని క్వీన్స్ మేరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 7 వరకు కొనసాగుతాయన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంలట వరకు పరీక్ష ఉంటుంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 268 పరీక్ష కేంద్రాలను కేటాయించామన్నారు. వీటిలో నగర పరిధిలో రెగ్యులర్ విద్యార్థులకు 113, ప్రైవేటు విద్యార్థులకు 15 కలిపి మొత్తం 128 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అలాగే రూరల్ పరిధి విద్యార్థులకు సంబంధించి రెగ్యులర్ విద్యార్థులకు 127, ప్రైవేటు విద్యార్థులకు 13 కేంద్రాలు కలిపి మొత్తం 140 కేంద్రాలను కేటాయించినట్టు తెలిపారు.
కాగా, ఈ ఏడాది మొత్తం 62568 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు. అందులో రెగ్యులర్ విద్యార్థులు 56756, ప్రైవేటుగా 5812 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. నగర పరిధిలో 30805 మంది, రూరల్ పరిధిలో 31763 మంది ఉన్నారని తెలిపారు. నగర పరిధికి సంబంధించి రెగ్యులర్‌లో 27493 మంది, ప్రైవేటుగా 3312 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే రూరల్ పరిధికి సంబంధించి రెగ్యులర్ 29263 మంది, ప్రైవేటుగా 2500 మంది ఉన్నారు. ఇక కేటగిరీల వారీగా ఏయే పాఠశాలల నుంచి ఎంతెంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నదీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 1967, జెడ్పీ నుంచి 19481, ఎయిడెడ్ 1953, మున్సిపల్ 2003, ఎపిఆర్‌ఎస్ 475, ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్ 676, ఎపిటిడబ్ల్యుఆర్‌ఎస్ 669, కెజిబివి 1292, ఎపి మోడల్ 316, టిడబ్ల్యుఎహెచ్‌ఎస్ 1696, సిఎహెచ్‌ఎస్ 627, ప్రైవేటు 23987, జిఎహెచ్‌ఎస్ నుంచి 731, జిటిడబ్ల్యుఎ నుంచి 816, ఎన్‌వి 46, ఐవిపి నుంచి 21 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షల టైమ్ టేబుల్ వివరాలిలా ఉన్నాయి. 21న ఫస్ట్ లాంగ్వేజి (తెలుగు)పేపర్-1, 22న ఫస్ట్ లాంగ్వేజి (తెలుగు)పేపర్-2, 24న సెకండ్ లాంగ్వేజి, 26న ఇంగ్లీష్ పేపర్-1, 28న ఇంగ్లీష్ పేపర్-2 ఉంటుంది. 29న మేథమెటిక్స్ పేపర్-1, 30న మేథమెటిక్స్ పేపర్-2, 31న జనరల్ సైన్స్ పేపర్-1, ఏప్రిల్ 1న జనరల్ సైన్స్ పేపర్-2, 2న సోషల్ స్టడీస్ పేపర్-1, 4న సోషల్ స్టడీస్ పేపర్-2 ఉంటాయని డిఇఒ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిఇఒ వివరించారు. పరీక్షకు అర్ధగంట ముందరే ఆ కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలి. సెల్‌ఫొన్లు, కాలిక్యులేటర్లు వంటివి పరీక్ష కేంద్రానికి తీ సుకెళ్లరాదు. విద్యార్థులు హాల్ టిక్కెట్ నంబర్లను మెయిన్ ఆన్సర్ షీట్ మీదగాని, అడిషనల్ షీట్, బిట్ పేపర్ల మీద రాయకూడదని తెలిపారు.