విశాఖపట్నం

కార్మికుల జీతాలను చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు బకాయిపడిన రెండు మాసాల జీతాలను వెంటనే చెల్లించాలని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వివిఎల్ నర్సింహులు డిమాండ్ చేశారు. గత కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా దీని గురించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఫలితంలేకపోయిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమం తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యం ఖూనీ
అరకులోయ, మార్చి 19: న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని స్థానిక మండల అధ్యక్షురాలు కె అరుణకుమారి విమర్శించారు. తమ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా శాసనసభకు హాజరయ్యేందుకు హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆమెను శాసనసభలో ప్రవేశించకుండా దేశం ప్రభుత్వం అడ్డుకోవడాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అరకులోయలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిధి గృహం నుంచి ర్యాలీ చేపట్టి నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి వెళ్లేందుకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం అడ్డుకోవడం చట్టానికి విరుద్ధమని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె విమర్శించారు. రోజా అంశంలో ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న రోజా గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం ఎంతమాత్రం తగదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ సమర్డి గులాబి, వైసీపీ నాయకులు శెట్టి అప్పాలు, సమర్డి రఘునాధ్, శ్రీరాములు, సొర్రు, దొన్ను, కొండ, శ్రీను, సుందరరావు, అప్పారావు, పలువురు కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.

25న ఐటిడిఎ సమావేశం
పాడేరు,మార్చి 19: పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) పాలకవర్గ సమావేశాన్ని ఈ నెల 25వ తేదీ శుక్రవారం జరగనుంది. ఐటిడిఎ చైర్మన్, కలెక్టర్ ఎన్ యువరాజు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన పాలకవర్గ సమావేశం ఈ సారి నిర్ణీత వ్యవధిలో నిర్వహిస్తుండడం విశేషం. ఐటిడిఎ పాలకవర్గ సమావేశం ఇంతవరకు క్రమం తప్పకుండా నిర్ణీత సమయానికి నిర్వహించిన దాఖలాలు లేవనే చెప్పాలి. మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని రెండేళ్ల పాటు కూడా నిర్వహించకుండా కాలయాపన చేయడం, సమావేశ తేదిని ఖరారు చేసి వాయిదాల పర్వం కొనసాగిన సందర్భాలే అనేకం. పార్లమెంట్, శాసనసభ సభ్యులు, ఎంఎల్‌సిలు సభ్యులుగా ఉన్న పాలకవర్గ సమావేశాన్ని నెలల తరబడి నిర్వహించకపోవడమే అనేక సార్లు ప్రజాప్రతినిధుల నుంచి అసంతృప్తి వ్యక్తం కావడం, గిరిజనులు నిరసన వ్యక్తం చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటూ ఉండేవి. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో ఐటిడిఎ పాలకవర్గ సమావేశం నిర్వహించినపుడు ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబును ప్రజాప్రతినిధులు నిలదీశారు. ఐటిడిఎ పాలకవర్గ సమావేశాన్ని నెలల తరబడి నిర్వహించకుండా కాలయాపన చేస్తుండడం వలన గిరిజన సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయని, గిరిజనులకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయలేకపోతున్నామని పలువురు శాసనసభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన ఐటిడిఎ పాలకవర్గ సమావేశానికి ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ప్రతి మూడు నెలలకు ఐటిడిఎ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు గత ఏడాది డిసెంబర్ 28వ తేదిన సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 28న పాలకవర్గ సమావేశం నిర్వహించగా కచ్చితంగా మూడు నెలలు కావచ్చేసరికి పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ నెల 25వ తేదీన సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎంతో ప్రతిష్టాత్మకం, కీలకమైన ఐటిడిఎ సమావేశానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరు కావచ్చునని సమాచారం.