విశాఖపట్నం

రూ. 1150 కోట్లతో రుణ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1150 కోట్ల రూపాయలతో రుణ ప్రణాళికను రూపొందించాలని ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ జి.విజయకుమార్ వెల్లడించారు. ఇక్కడి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు కేసు ల కారణంగా ఈ ఏడాది రుణ ప్రణాళిక ఖరారులో ఆలస్యం చోటు చేసుకుందన్నారు. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ యువతకు వివిధ కోర్సుల్లో 36 వేల మందికి ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఈ ఏడాది నుంచి భూమి అభివృద్ధి పథకం కింద ఎస్సీ లబ్ధిదారుల ఐదు ఎకరాల భూమి లో ఉపాధి కింద అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, విశాఖల్లో ఎస్సీ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి అంచనాలు తయారు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఇప్పటికే ఒకసారి దరఖాస్తు చేసినప్పటికీ రుణం రాని వారు తరువాతి సంవత్సరంలో మరో సారి దరఖాస్తు చేయకుండా రుణాలు మంజూ రు చేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూమి కొనుగోలుకు ఐదు లక్షల రూపాయలు సరిపోవడం లేదని, దీనిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా అంతకుముందు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఇడిలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ కార్పొరేషన్ ఇడి మహాలక్ష్మి, జిఎం కాలిబ్ పాల్గొన్నారు.