విశాఖపట్నం

నెంబర్‌వనే్న లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 25: విశాఖ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తాను టీమ్ లీడర్‌గా టీమ్ వర్క్‌తో పని చేస్తానని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్‌గా పని చేస్తూ కేంద్ర సర్వీసులకు బదిలీపై వెళ్ళిన డాక్టర్ ఎన్.యువరాజ్ నుంచి సోమవారం ప్రవీణ్‌కుమార్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, అధికారులు పూర్తిస్థాయిలో తోడ్పాటునివ్వాలన్నారు. కీలకమైన 40 ప్రభుత్వ విభాగాలున్నాయన్నారు. అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించడం ద్వారా స్మార్ట్‌సిటీగా ఎదుగుతోన్న విశాఖ నగరాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్తామన్నారు. అలాగే విశాఖ జిల్లాను ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపడమే లక్ష్యంగా పేర్కొన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, ఉపాధి వంటికి అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నట్టు ఆయన చెప్పారు. 2020 వంటి అనేక విజన్లను దృష్టిలోపెట్టుకుని నిత్యం అభివృద్ధిపైనే దృష్టిపెట్టాలని, అపుడే లక్ష్యాలు సాధించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. నిజాయితీగా పనిచేస్తానని, అలాగే అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ అన్నివిధాలా అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. భూముల అంశంలో కఠినంగా వ్యవహరిస్తానన్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ తక్కువుగా ఉందని, అయినా అక్కడి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేయగలనన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా టీమ్ వర్క్‌తో పనిచేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ల ద్వారా వివిధ రంగాలకు సంబంధించి లక్ష్యాలను నిర్ధేశించిందన్నారు. వాటిని చేరుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికీ జాయింట్ కలెక్టర్‌గా, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిగా, జివిఎంసి కమిషనర్‌గా పనిచేసినందున అన్నీ ప్రాంతాలపై తగిన అవగాహన ఉందన్నారు. ఈ అవగాహనతో టీమ్ లీడర్‌గా జిల్లా యంత్రాంగానికి ముందుకు నడిపిస్తామన్నారు. జిల్లాలోని ఏజేన్సీ ప్రాంతంలో వైద్యం, విద్య తదితర అంశాల్లో దృష్టిపెడితే జిల్లాలోని ఇతర ప్రాంతాలతో సమానంగా వాటిని కూడా తీసుకురాగలమన్నారు. తద్వారా ఆర్ధికాభివృద్ధిలో జిల్లా అగ్రస్థానంలో నిలబెట్టవచ్చన్నారు. జిల్లాలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఇప్పటికీ నెలకొని ఉందని, దీనిని మరింతగా వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతంగా మంచి పెట్టుబడులను పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, ఐటి, ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ ద్వారా మరింతగా ఆర్ధికాభివృద్ధి సాధ్యమై ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ రంగాలన్నింటిపై దృష్టి సాధించాలన్నారు. జిల్లా అభివృద్ధికి నీతి, నిజాయితీతో కష్టపడి పనిచేస్తామని, అధికారులందరితో ఒక టీమ్ వర్క్‌తో పనిచేస్తామన్నారు.
బాలికపై అత్యాచారం జరగలేదు
విశాఖపట్నం(క్రైం), జూలై 25: అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన బాలిక (14) అత్యాచారానికి గురి కాలేదని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్టు జాయింట్ పోలీసు కమిషనర్ సత్తర్‌ఖాన్ తెలిపారు. పెందుర్తి పరిధిలోని కృష్ణరాయపురంలో నివాసముంటున్న బాలిక అదే ప్రాంతంలో ఉంటున్న ఓ యువకునితో ప్రేమలో పడిన విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు శనివారం మందలించడంతో రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతికి చివరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇంటి పక్కన గల అపార్ట్‌మెంట్ పక్కన బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. అయితే తమ కుమార్తెను ప్రేమికుడే కడతేర్చడని తల్లిదండ్రులు ఆరోపించిన సంగతి విదితమే. ఈ తరుణంలో ప్రేమికుడుని పోలీసులు అదుపులోకి తీసుకోగా, బాలికపై అత్యాచారం జరగలేదని, అపార్ట్‌మెంట్ పై నుండి కింద పడిపోవడం వలన తీవ్రగాయాలై మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్టు జాయింట్ సిపి సత్తర్‌ఖాన్ సోమవారం ‘ ఆంధ్రభూమి’కి తెలియజేశారు. తల్లిదండ్రులు మందలించారని పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైన ఆమెను పై నుండి కిందకు తోసివేశారా అన్నది దర్యాప్తులో తేలాల్సివుందన్నారు. పెందుర్తి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు రూపంలో కబళించిన మృత్యువు
అగనంపూడి/పరవాడ, జూలై 25: ఆర్టీసీ బస్ మృత్యువురూపంలో ఒక మహిళలను సోమవారం కబళించింది. మరో వ్యక్తిని తీవ్ర గాయాల పాలు చేసింది. మరో వారం రోజుల్లో అమెరికాలో ఉన్న కుమారుడు, కోడలి వద్దకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ఆ మహిళను మృత్యువు ఆర్టీసీ బస్ రూపంలో తిరిగి రాని లోకానికి పంపింది. దీనికి సంబంధించి పరవాడ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి.చిన స్వామినాయుడు అందించిన వివరాలిలా వున్నాయి. గాజువాక కైలాస్‌నగర్ ప్రాంతానికి చెందిన పల్లెల జానకి (58) పరవాడ మండలం దేశపాత్రునిపాలెం శివారు జాజులవానిపాలెం గ్రామానికి చెందిన వియ్యంకుడు జెర్రిపోతుల అప్పారావుతో కలసి ద్విచక్ర వాహనంపై అగనంపూడి నుండి లంకెలపాలెం వైపు వెళ్తున్నారు. ఈ తరుణంలో అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్ జానకి, అప్పారావు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అప్పారావు రహదారికి ఎడమ వైపున, జానకి రహదారికి మధ్యన పడి పోయారు. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సే జానకి తలపై నుండి వెళ్లి పోయింది. దీంతో జానకి తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందగా, అప్పారావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్పారావును అనకాపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జానికి భర్త సత్యనారాయణ డాక్‌యార్డ్ విశ్రాంత ఉద్యోగి. అయితే దేశపాత్రునిపాలెం రెవెన్యూ పరిధిలో ఇళ్ల స్థలాన్ని ఇటీవల భార్య జానికి పేరుతో కొనుగోలు చేశారు. దీంట్లో భాగంగా సదరు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సోమవారం లంకెలపాలెం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణ, జానకి అమెరికాలో ఉన్న తన రెండవ కుమారుడు రామకృష్ణ, కోడలు హైమ వద్దకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కోడలు గర్భవతి కావడంతో జానకి, సత్యనారాయణ అమెరికా వెళ్లి ఆరు నెలల పాటు ఉండేందుకు నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగానే కొనుగోలు చేసుకున్న స్థలాన్ని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సోమవారం లంకెలపాలెం బయలదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జానకి మరో కుమారు కువైట్‌లో ఉన్నారు. జానకి మృతదేహానికి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని స్టీల్‌ప్లాంట్ మార్చురీకి తరలించారు. జానకి ఇద్దరు కుమారులు విదేశాల నుండి బయలుదేరారు. వారు వచ్చే వరకు జానకి మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చురీలోనే భద్రపరుస్తారు. ఈ మేరకు పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులను పరామర్శించిన జగన్
గోపాలపట్నం, జూలై 25 : గల్లంతైన వాయుసేన విమానంలో ఉన్న ఎన్‌ఎడి ఉద్యోగుల కుటుంబాలను వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. ముందుగా 104 ఏరియా ప్రాంతంలో వున్న భూపేందర్‌సింగ్ గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య సంగీత, కుమారుడు అశుతోష్‌లను ఓదార్చారు. అధైర్యపడొద్దని ఆచూకి కోసం వెతుకుతున్నారని జగన్ అన్నారు. అక్కడి నుండి బుచ్చిరాజుపాలెం నమ్మి చిన్నారావు భార్య, కుమారులు, కుమార్తెను పరామర్శించారు. గంట్ల శ్రీనివాసరావు భార్య ఈశరమ్మను ఓదార్చారు. నాలుగు నెలల గర్భిణి అని తెలుసుకుని తల్లడిల్లిపోయారు. ధైర్యంగా ఉండాలని అన్నారు. శ్రీనివాస నగర్ ప్రాంతానికి చెందిన పాటి నాగేంద్రరావు భార్య పూర్ణిమ, తండ్రి ప్రకాశరావు తదితర కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. నాగేంద్ర భార్య పూర్ణిమ కన్నీరు మున్నీరై విలపిస్తుండగా అందరి కళ్ళు చమర్చాయి. కాగా అనంతరం జగన్ మాట్లాడుతూ తమవారి కోసం ఎదురు చూస్తున్న కుటుంబాల వారి ఆశలు వమ్ముకాకుండా గల్లంతైన వారు క్షేమంగా తిరిగి రావాలని వారు కోరుకుంటున్నానన్నారు. జగన్‌తో పాటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, తైనాల విజయకుమార్, ధర్మశ్రీ, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ కార్పొరేషన్ జియ్యాని శ్రీ్ధర్, నగర వైకాపా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
విమానాశ్రయంలో స్వాగతం
అంతకు ముందు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ నుండి విమానంలో విశాఖకు చేరుకున్న జగన్‌కు విమానాశ్రయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీ్ధర్, గుడివాడ అమర్‌నాథ్, కార్యకర్తలు స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో గల్లంతయిన విమానంలో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించడానికి జగన్ తరలి వెళ్లారు.
కొత్త కలెక్టర్‌కు వరుణుడి కటాక్షం
* బాధ్యత స్వీకరించిన సమయంలో కురిసిన వర్షం
* వరుసగా కార్యక్రమాలతో కలెక్టర్ బిజీబిజీ...
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, జూలై 25: విశాఖ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా సోమవారం ఉదయం 10.30గంటలకు బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఒకేసారి వర్షం కురిసింది. కొద్దిసేపు ఏకదాటిగా కురిసన వర్షం ఆ తరువాత నిలిచిపోయి ఎండ కాయడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందుగా ఆకాశం మేఘావృతంకావడం, ఆ తరువాత కొద్దిసేపటికే కుండపోత వర్షం కురియడంపట్ల వీరంతా శుభసూచకంగా భావిస్తున్నారు. అలాగే కేంద్ర సర్వీసులకు బదిలీపైన వెళ్లిన కలెక్టర్ డాక్టర్ యువరాజ్ నుంచి బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ఉదయం నుంచి రోజంతా బిజీబిజీగా గడపాల్సి వచ్చింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, నగరంలోని ప్రముఖులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు వరుసగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలరు, పలు వర్గాల ప్రజలు పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. దీని తదువాత స్మార్ట్ సిటీలు బోర్డు సమావేశంలో వీడియో కానె్ఫరెన్స్ ద్వారా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలనన్‌తో మాట్లాడారు. దీని తదుపరి ప్రజావాణిలో పాల్గొని ఒకవైపు జిల్లా అధికారులతో సమావేశం కాగా, మరోపక్క తొలిసారిగా అర్జిదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ విధంగా పలు కార్యక్రమాలతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ క్షణం తీరిక లేకుండా గడిపారు.