విశాఖపట్నం

లేబర్ కొరతతో ముందుకు సాగని సి.సి. రోడ్ల పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.డి.పేట: గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించ తలపెట్టిన సి.సి. రోడ్ల నిర్మాణాలు గడువు నెలాఖరులోగా ముగుస్తుండడంతో లేబర్ దొరక్క తగినంత మెటీరియల్ అందక ఇటు కాంట్రాక్టర్లు, అటు ఇంజనీరింగ్ అధికారులు పరుగులు తీస్తున్నారు. దీంతో గ్రామాల్లో సి.సి. రోడ్లు వేసేందుకు నిధులుండి ఖర్చు చేయలేని పరిస్థితి ఏజన్సీ, మైదాన ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఈనెలాఖరులోగా నిధులు ఖర్చు చేయకపోతే చర్యలు తప్పవంటూ జిల్లా కలెక్టర్ హుక్కుం జారీ చేయడంతో , నిర్మాణాలకు కూలీలు దొరకకపోవడంతో వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేక పోతున్నామనే ఆందోళన ప్రజాప్రతినిధుల్లో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల స్వయం అభివృద్ధికై లక్షల రూపాయల ఉపాధి నిధులు వెచ్చిస్తూ వాటికి 10 శాతం కంట్రీబ్యూషన్ నిధులు చెల్లించి నెలాఖరులోగా ఖర్చు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో తక్కువ వ్యవధిలో సి.సి. రోడ్లు వేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే గ్రామాల్లో వీటి నిర్మాణాలకై తగినంత మెటీరియల్ , కూలీలు దొరకక పోవడంతో నిధులుండి ఉపయోగపడలేని పరిస్థితి ఏర్పడింది. గొలుగొండ మండలానికి ఉపాధి హామీ నిధులతో 57 సి.సి. రోడ్లు వేసేందుకు 24.70 కోట్లు మంజూరు కాగా, ఏజన్సీ ప్రాంతమైన కొయ్యూరరు మండలానికి 1.90 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇంత వరకు 50 శాతం కూడా నిధులు ఖర్చు చేయకపోవడంతో మరో రెండు వారాలే గడువు ఉండడంతో ఇంజనీరింగ్ అధికారులు , ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో లేబర్ దొరకక పోవడంతో ఇతర ప్రాంతాల నుండి లేబర్‌ను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నారు. నాగాపురం, పాతూరు, ఎ. ఎల్.పురం, చోద్యం మల్లంపేట, తదితర పంచాయతీల్లో సి.సి. రోడ్లు వేయగా మరో 10 పంచాయతీల్లో 50 శాతం నిధులు మాత్రమే ఖర్చు అయ్యాయి. జిల్లా మంత్రి, కలెక్టర్ ఉపాధి నిధులు ఖర్చుపై పునరాలోచించి వీటి నిధులు ఖర్చుకు గడువు పెంచాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు.

అటవీ విత్తనాలు సేకరణ

కొయ్యూరు: పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా అడవులను పెంచేలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల సేకరణ కార్యక్రమంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మండలంలో విరివిగా లభించే వివిధ రకాల వృక్షజాతుల విత్తనాలను స్థానిక అటవీ శాఖ సిబ్బంది సేకరిస్తున్నారు. ముఖ్యంగా చల్లని నీడనిచ్చే చెట్లైన కానుక, నల్లమద్ది, టేకు, రోజ్‌వుడ్, గన్నర, జాప్రా, ఉసిరి, నెమలి, మారేడు తదితర వివిధ రకాల వృక్ష జాతుల నుండి విత్తనాలను సేకరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగానే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించే చర్యల్లో గణనీయంగా తగ్గిపోతున్న అడవులను వృద్ధి చేసే దిశగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి ఖాళీ ప్రదేశాలను, పాఠశాలలను అటవీ ప్రాంతంలో వృక్షాలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. ఈ ఏడాది నర్సీపట్నం డివిజన్ పరిధిలో15.90 లక్షల వివిధ రకాల మొక్కలను నర్సరీల ద్వారా పెంచుతున్నారు. వీటిని డివిజన్ వ్యాప్తంగా పాఠశాలలు,ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆసక్తిగల రైతాంగానికి వారి వారి చేలలో పెంచుకునేందుకు వీలుగా వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది 16 టన్నుల విత్తనాల సేకరణ లక్ష్యం కాగా నేటికి రెండు టన్నుల విత్తనాలను సేకరించినట్లు డి. ఎఫ్. ఓ. లక్ష్మణ్ తెలిపారు. కె.డి.పేట, మర్రిపాకలు తదితర రేంజ్‌ల పరిధిలో సిబ్బంది సీజనల్‌గా దొరికే విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారని ఆయన పేర్కొన్నారు.