విశాఖపట్నం

రోజాను అడ్డుకోవడం చట్ట ఉల్లంఘనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం: న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి వెళ్ళకుండా అడ్డుకోవడాన్ని నిరశిస్తూ వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ఆందోళన నిర్వహించారు. శ్రీకన్య కూడలి నుండి వైకాపా నాయకులు, కార్యకర్తలు ఊరేగింపుగా అబీద్ సెంటర్‌కు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నియోజకవర్గం కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రోజాపై ప్రభుత్వ కక్ష సాధింపునకు దిగడం దారుణమన్నారు. అసెంబ్లీ స్పీకర్ సైతం అధికార పార్టీకి తొత్తుగా వ్యహరిస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలని గణేష్ డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కోనేటి రామకృష్ణ, గొలుసు నర్సింహమూర్తి, గుడివాడ లచ్చబాబు, నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీలేరులో అధిక ఉష్ణోగ్రతలు
సీలేరు, మార్చి 19: సీలేరులో గత రెండు రోజులుగా పగతిపూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోవడంతో ఈ ప్రాంతీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విశాఖ ఏజన్సీ సీలేరు, దారకొండ, సప్పర్ల , దుప్పిలవాడ ప్రాంతాల్లో మండు వేసవి కాలంలో కూడా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. అటువంటివి హుద్‌హుద్‌తుఫాన్ దాటికి చెట్లు నేలకు ఒరిగిపోవడంతో ఈప్రాంతంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మార్చి నెలలోనే ఎండలు తీవ్ర రూపాన్ని దాల్చడంతో సీలేరు వాసులు అల్లాడుతున్నారు. ఎండల ధాటికి తాళలేక మధ్యాహ్నం మూడు గంటల వరకు రోడ్లపైకి వచ్చేందుకు ఎవ్వరూ సాహసించడం లేదు.