విశాఖపట్నం

జెండా ఎగరాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 28: ‘విశాఖ మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలుగుదేశం జెండా ఎగరాల్సిందే. ఏమి చేద్దాం? ఎలా చేద్దాం? మున్సిపల్ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఎన్నికలకు ఎలా వెళ్తే బాగుంటుంది? ప్రత్యక్ష లేదా పరోక్ష ఎన్నికల్లో మనకు ఏది బెస్టు? పొత్తుల గురించి మీరు ఆలోచించవద్దు. ఏం చేస్తే మనం లబ్ధిపొందుతాం? ఇలాంటి విషయాలన్నీ కలిసి కూర్చుని చర్చించుకుంటే మనకే మంచిది’.. అంటూ జిల్లా మంత్రులు అయన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో మంత్రి యనమల రామకృష్ణుడు నగరంలో గురువారం సుదీర్ఘ మంతనాలు జరిపారు. తొలుత ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశమైన ప్రతినిధులు తదనంతరం వేదికను డాబాగార్డెన్సులోని పార్టీ ఆఫీసుకు మార్చారు. దాదాపు రెండున్నర గంటలపైగా జరిగిన ఈ సమీక్షలో కీలక చర్చ జివిఎంసి ఎన్నికలతో పాటు ప్రభుత్వ పథకాల అమలు, వాటిపై జరుగుతున్న ప్రచారంపైనే కేంద్రీకృతమైంది. విశాఖ అర్బన్‌కు వచ్చే సరికి జివిఎంసి ఎన్నికలపై ఎవరి అభిప్రాయాలు వారు వెలిబుచ్చారు. ఇదే సందర్భంలో మున్సిపల్ ఎన్నికలు సాధ్యమైనంత త్వరలో జరిగే అవకాశం ఉంది కనుక ఏ క్షణమైనా ప్రకటన వెలువడవచ్చని యనమల తెలిపారు. మనం ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉండాలి అంటూ యనమల సమన్వయ కమిటీకి హితబోధ చేశారు. ప్రభుత్వం, పార్టీ పరంగా ఏం చేయాలి, ఎలా చేయాలి మీ అభిప్రాయాలు వెల్లడిస్తే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ, పార్టీ పరంగా చేపట్టాల్సిన అంశాల్లో నియోజకవర్గాల వారీగా నివేదిక ఇవ్వాలని యనమల ఆదేశించారు. ఇదే సందర్భంలో సమన్వయకమిటీ సభ్యులు మిత్రపక్షంతో పొత్తు అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై యనమల ‘అవి అప్రస్తుతమని, అయినా అవి మీ పరిధిలోనిది కాదు. మీ పని మీరు చేయండి’ అన్నట్లు భోగట్టా. కాగా ఆగస్టు 1, 2 తేదీల్లో నియోజకవర్గాల వారీగా సమన్వయకమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు. చాలా కాలంగా జిల్లా సమన్వయకమిటీ సమావేశం జరుగలేదు. దీంతో యనమల హడావుడిగా విశాఖకు వచ్చి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అర్బన్ పరిధిలో ఉన్న ప్రజా ప్రతినిధులు హాజరుకాగా, గ్రామీణ ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో హాజరుకాకపోవడం గమనార్హం.