విశాఖపట్నం

గెలుపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 5: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. జిల్లా నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు స్థానిక సవేరా ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ముఖ్యకార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిందని, ఇప్పటి వరకూ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. బిజెపితో పొత్తు అంశం పక్కనపెట్టి తెలుగుదేశం స్వతహాగా జివిఎంసి ఎన్నికల్లో గెలుపొందే విధంగా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఇతర అంశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఇక నామినేటెడ్ పోస్టులు, ఇతర కోరికలను పక్కనపెట్టి నియోజకవర్గంలో సమస్యలేమైనా ఉంటే చెప్పండి, నా పరిధిలో ఉంటే పరిష్కరిస్తానంటూ మంత్రి యనమల కార్యకర్తలకు హితబోధ చేశారు. నామినేటెడ్ పోస్టుల అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని, ఏకాభిప్రాయం మేరకు వచ్చే పేర్లను ఇప్పటికే ప్రకటించిన అధినేత, త్వరలోనే ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇదే అంశాన్ని ఇటీవల నగరంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వెల్లడించారన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జాబితాలను సిద్ధం చేస్తే ప్రకటించేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందన్నారు. సమన్వయ కమిటీ సమావేశాల ప్రారంభానికి ముందు కార్యక్రమంలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, పిజివిఆర్ నాయుడు (గణబాబు), వెలగపూడి రామకృష్ణ బాబు, పాల్గొన్నారు. ఉదయం భోజన విరామానికి ముందు విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం, గాజువాక, భీమునిపట్నం నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. భీమునిపట్నం నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. భోజన విరామం అనంతరం విశాఖ ఉత్తరం, అనకాపల్లి నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు జరగాల్సి ఉంది.