విశాఖపట్నం

రూ. 1100 కోట్లతో ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 7: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1100 కోట్లతో ఎస్సీ కార్పొరేషన్ రుణ ప్రణాళికను రూపొందించారని, దీని ద్వారా 99వేల 464 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం సంస్థ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకూ పట్టణ ప్రాంతాలపైన అధికంగా దృష్టి సారించి కార్యక్రమాలు నిర్వహించామని, ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో దళితుల జీవన ప్రమాణాలు పెంచేందుకు వారిని దారిద్య్ర రేఖ ఎగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 20 లక్షల దళిత కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే దిశగా సంస్థ నూతన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. దీనిలో భాగంగానే యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిచ్చి వారికి పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కార్యక్రమాలు రూపొందించామని, లక్ష మంది యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో దళితులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో యువస్ఫూర్తి సమ్మేళనం పేరుతో ఓ కార్యక్రమం చేపడుతున్నామని, విద్యావంతులైన ఎస్సీ యువత ఆధ్వర్యంలో నిరాక్షరాస్యులైన దళితులను గుర్తిస్తున్నామన్నారు. ప్రతి గ్రామం నుంచి ఐదు నుంచి పది మంది యువతను గుర్తించి వారి ద్వారా ఈ కార్యక్రమం చేపడతామన్నారు. కార్పొరేషన్ కార్యక్రమాల్లో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించేందుకు పలు సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఎస్సీలు దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని సంబంధిత ఆలయ అధికారులతో సంప్రదించామని, త్వరలోనే అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అంతే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది పది వేల మంది దళితులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇడి మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.