విశాఖపట్నం

రాజధానికి బదిలీల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అవసరమైన ఇంజనీరింగ్ అధికారుల నియామకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి ఒక్కసారిగా 11 మంది ఇంజనీరింగ్ అధికారులను కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ)కి బదిలీ చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాలవలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. వుడా ఇంజనీరింగ్ అధికారులను డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణమే వీరంతా రిలీవై, అమరావతిలో చేపడుతున్న నిర్మాణం పనుల పర్యవేక్షణలో పాల్గొనాలని ఆదేశించారు. వుడాలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్ సహా ఇద్దరు ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్లు, ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్లు, ఐదుగురు సహాయ ఇంజనీర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వుడా చీఫ్ ఇంజనీర్ జయరామిరెడ్డి జివిఎంసిలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై వుడాకు బదిలీ అయ్యారు. అలాగే వుడా ఇంజనీరింగ్ విభాగంలో ఇఇలుగా పనిచేస్తున్న ఐ సూర్య, ఎం బలరామరాజు, డిఇలుగా పనిచేస్తున్న జి మురళీకృష్ణ, శ్రీనివాసరావు, మధుసూధన రావు, ఎఇలుగా పనిచేస్తున్న ఎన్ మురళీకృష్ణ, ఎ శ్రీనివాసరావు, ఎ సదానందరావు, ఎస్ నాయుడు, మురళీకృష్ణలను అమరావతికి బదిలీ చేశారు.
వుడా వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బాబూరావు నాయుడు కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధులు, పనితీరుపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిధుల లేమితో సతమతమవుతున్న వుడా గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన పనులను పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతోంది. ప్రాజెక్టుల ప్రగతి ఎటూ కదలని పరిస్థితుల్లో ఇంజనీరింగ్ సిబ్బందిని ఖాళీగా ఉంచడం ఎందుకని భావించారో ఏమో భారీ ఎత్తున ఇంజనీరింగ్ సిబ్బందిని అమరావతికి బదలాయించినట్టు తెలుస్తోంది. అయితే వుడా ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన పలు ప్రాజెక్టులు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. పనులు చేపట్టిన గుత్తేదార్లు కుంటి సాకులు చూపి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయట్లేదు. చీఫ్ ఇంజనీర్ సహా ఒక్కసారిగా ఇంతమంది ఇంజనీరింగ్ సిబ్బందిని బదిలీ చేసే సాహసానికి మున్సిపల్ శాఖ సిద్ధంకావడం గమనార్హం. అనుకున్న సమయానికి అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమే అయినప్పటికీ కీలకమైన విశాఖ నగరంలో అంతే ప్రాధాన్యత కలిగిన వుడా నుంచి అంతమందిని ఒక్కసారిగా బదిలీ చేయడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.