విశాఖ

అతిసార విజృంభణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంచంగిపుట్టు, ఆగస్టు 12: మండలంలోని దారెల పంచాయతీ బి.కుమ్మరిపుట్టులో అతిసార వ్యాధి ప్రబలి ఒకరు మృతి చెందిగా మరో 24 మంది అతిసార లక్షణాలతో మంచంపట్టారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బి.కుమ్మరిపుట్టు గ్రామంలో కలుషిత నీటిని సేవించడం వలనే అతిసార వ్యాధి ప్రబలి వారంలో రాజులమ్మ,బాబురావు, మన్నన్నలు మృతి చెందిన విషయం విధితమే. శుక్రవారం ఉదయం పాంగి బిమల (55) గత రెండు రోజులుగా అతిసార లక్షణాలతో బాధ పడుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో ఒక్కొక్కరూ అతిసార లక్షణాలతో మృతిచెందుతుండడంతో గ్రామస్థు లు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన పాంగి నితిన్, కె.రేఖమ్మ, నీలమ్మ, వౌని క, మొత్తిల పరిస్థితి విషమంగా ఉంది. వీరితో పాటు కె.పరశురాం, కె.్భవన, తిలక్, దాలమ్మ, మహేంద్ర, సుమన్, మరో 13 మంది వర కూ అతిసార వ్యాధితో మంచం పట్టారు. కింది స్థాయి సిబ్బంది వైద్య సేవలందిస్తున్నప్పటికీ వ్యాధులు అదుపులోకి రావ డం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాల ని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నా రు. ఆర్.డబ్యు.ఎస్. అధికారులు గ్రామం లో బోర్‌వెల్ ఏర్పాటు చేసి పైపులు అమర్చినప్పటికీ నీటి సరఫరా చేయకపోవడంతో సమీపంలోని మత్స్యగెడ్డ ఆశ్రయించి ఆ నీటిని సేవించడం వలనే రోగాల బారినపడుతున్నట్టు వారు చెప్పారు.