విశాఖపట్నం

నీరుగారుతున్న నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 12: ఒకవైపు కృష్ణా పుష్కరాలు, మరోపక్క ఆగస్టు 15తో నిఘా పక్కాగా అమలు జరగాలి. కానీ విజయవాడలో ఈ నెల 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాల్లో బందోబస్తు నిర్వహించేందుకు ప్రభుత్వ రైల్వే పోలీసులు నాలుగు రోజుల కిందటే తరలి వెళ్ళిపోయారు. కృష్ణా పుష్కరాలకు తరలివెళ్ళే భక్తులతో రైళ్ళన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్లాట్‌ఫారాలు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, జ్ఞానాపురం స్టేషన్, తొమ్మిది జనరల్ బుకింగ్ కౌంటర్లు, వాహనాల పార్కింగ్, స్టేషన్ బస్‌స్టాప్ ఇలా ప్రతిఒక్క చోట జనసంద్రంగా మారింది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పలు రైళ్ళ ద్వారా ప్రయాణికులు కృష్ణా పుష్కరాలకు తరలివెళ్తున్నందున రద్దీ విపరీతంగా ఉంటుంది. దీనిని నియంత్రించి క్రమ పద్థతిలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రయాణికులను సాగనంపే యంత్రాంగం ఇప్పుడు కొరవడింది. పుష్కరాల భద్రతకు పోలీసులు వెళ్ళిపోయినందున, ఉన్న కొద్దిమంది ప్లాట్‌ఫారాలపై భద్రతకే సరిపోవడంలేదు. మరోపక్క ఆగస్టు 15 రోజున పటిష్ఠ భద్రత నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక నిఘా కష్టతరంగా మారుతోంది. క్లోజ్డ్ సర్క్యూట్ టివిలు పెంచినా, పోలీసు బలగాలు లేని కారణంగా విశాఖ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అవాంఛనీయ
సంఘటనలు జరిగితే?
పోలీసు నిఘా తగ్గిన నేపథ్యంలో ఆగస్టు 15న భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో అవాంఛనీయ సంఘటనలు తలెత్తే పరిస్థితులపై పోలీసువర్గాల కలవరపడుతున్నాయి. డాగ్‌స్వ్కాడ్ ద్వారా టిక్కెట్ లేని ప్రయాణికులను విస్తృతంగా తనిఖీ చేయడం సాధ్యపడటంలేదు. అసలే ఈ మధ్యకాలంలో రైళ్ళల్లో చోరీలు పెరిగిపోతున్నాయి. అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలు ఉంటున్నాయి. దేశంలో పలుచోట్ల అరాచకాలకు పాల్పడే బంగ్లా దేశీయులకు విశాఖ రాచమార్గంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో వీరి కదిలికలను పసిగట్టే పోలీసు బలగాలు కానరావడంలేదు. గంజాయి, గుట్కా వంటి నిషేధిత సరకుల అక్రమ రవాణాకు ఈ స్టేషన్ అడ్డాగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో 24 గంటలు పటిష్ఠ భద్రత నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ క్రమంలో చర్యలేవీ కనిపించడంలేదంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిల్లర దొంగలపై దృష్టి పెట్టడం, తోపులాటలను నివారించడం, ఫిర్యాదులను స్వీకరించేందుకు సైతం పోలీసులు అందుబాటులో లేకుండా పోతున్నారని ప్రయాణికులు రైల్వే అధికారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.