విశాఖపట్నం

ఆర్థిక స్వాతంత్య్రంతోనే అసమానతలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 15: ఆర్థిక స్వాతంత్య్రంతోనే సమాజంలో అసమానతలు తొలుగుతాయాని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కానీ ఇంకా చేయాల్సి చాలా ఉందన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పోలీస్, ఎన్సీపీ తదితర దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమ సమాజ, నవ సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు చర్యలు తీసకుంటున్నా, కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయన్నారు. ఆర్థిక సమానత్వంతో అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలు చేపడుతున్నామన్నారు. విశాఖ జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సింగపూర్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ముంబయి తరువాత దేశంలోనే ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో జిల్లాలో 30 శాతం భూములే వినియోగిస్తున్నారని, దీనిని మరింతగా పెంచాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు వచ్చినప్పటికీ, అప్పుడు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతూనే ఉన్నామని, కష్టాలను ఎదుర్కొంటూనే అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి కలిస్తే సేవారంగం పురోభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపి కె.హరిబాబు, ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, వుడా వీసీ బాబూరావు నాయుడు, జివిఎంసి కమిషనర్ హరినారాయణన్, పోలీస్ కమిషనర్ యోగానంద్, ఎస్పీ రాహుల్ దేవ్ వర్మ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను మంత్రి అందచేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 13 శకటాలను ప్రదర్శించారు. ఐటిడిఎ శకటానికి ప్రథమ బహుమతి, పౌరసరఫరాల శాఖకు ద్వితీయ బహుమతి, గ్రామీణాభివృద్ధి శాఖకు తృతీయ బహుమతి లభించాయి. డిఆర్‌డిఎ, వికలాంగుల శాఖ, బిసి, ఎస్సీ, కార్పొరేషన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖలకు చెందిన 4428 మంది లబ్థిదారులకు 106.4 కోట్ల రూపాయల మేరకు ఆస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వమ్మవరం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన రోప్ మాల్కంబ్ ప్రదర్శనకు ఆకట్టుకుంది. తాడుపై వివిధ ఆసనాలను విద్యార్థులు వేసిన తీరు బాగుంది. దీనిని మొదటి బహుమతికి ఎంపిక చేశారు.
నగర రోడ్లపై జాతీయ జెండాల ప్రదర్శన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండాను రహదారులపై ప్రదర్శనగా సోమవారం ఊరేగించారు. 66వ డివిజన్ వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో గోపాలపట్నం నుండి ఎన్ ఎడి కూడలి వరకు వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తాటిచెట్లపాలెంలోని ఒక పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా 200 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆర్కే బీచ్ రోడ్డులో ఒక కళాశాల విద్యార్థులు 1000 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించరు.
భద్రతను మరింతగా పెంచాలి
* తూర్పునౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 15: ప్రపంచానికి ఉగ్రవాదం సవాల్‌గా పరిణమించిదని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ తెలిపారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఇక్కడ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 7, 8 నెలల కాలంలో ప్రపంచంలోని అనేక నగరాల్లో ఉగ్రవాదుల దాడులు జరిగాయని, అనేక మంది మృతి చెందారన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భద్రతను మరింత పెంచాలన్నారు. నౌకాదళానికి చెందిన ఆస్తులు సహా ఆసుపత్రులు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో 24/7 భద్రతా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం కష్ట సాధ్యమన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించుకుంటూ చిత్తశుద్ధితో పని చేస్తే ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలమన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
జాతీయ భావానికి తిరంగా యాత్ర దోహం : ఎంపి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 15: ప్రజల్లో జాతీయభావం పెంపొదించడానికి తిరంగయాత్ర దోహదపడుతుందని విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. బిజెపి పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పివి చలపతిరావు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎస్.కాశీవిశ్వనాథరాజు, ఎస్‌విఎస్ ప్రకాష్‌రెడ్డి, దక్షిణామూర్తి, రవికుమార్, కులపాక చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ వార్షిక ఆదాయం రూ. 7035 కోట్లు
* డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 15: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ వార్షిక ఆదాయం (2015-16) రూ.7035 కోట్లకు చేరుకుందని, ఈ విధంగా 5.71 శాతం వృద్ధి సాధించిందని డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖముఖర్జీ అన్నారు. తాటిచెట్లపాలెం రైల్వే ఆర్ఫీఎఫ్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జవాన్ల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. తదుపురి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు తీసుకుంటే 18 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ.1938 కోట్ల మేర, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.41 కోట్ల మేర సాధించామన్నారు. అదనపు డిఆర్‌ఎం అజయ్ అరోరా, ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వుమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షురాలు షర్మిల అరోరా, కార్యదర్శి మహురి కాశిపతి తదితరులు పాల్గొని రోగులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు.