విశాఖపట్నం

వాడ వాడలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, ఆగస్టు 15: వాడ వాడలా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని త్రివర్ణ పతాకాలు సోమవారం రెపరెపలాడాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలల్లో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నా రు. స్వాతంత్య్ర దినోత్స వ వేడుకల్లో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని జాతీ య జెండాలను ఆవిష్కరించారు. దీంట్లో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలు, పాటలు పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. పరవాడ తహశీల్దార్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరై జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ పయిల జగన్నాథరావు, మాజీ ఎంపీపీ మాధంశెట్టి నీలబాబు, ఎంపీటీసీలు పయిల శ్రీనివాసరావు, సిరపురపు అప్పలనాయుడు, కూండ్రపు సీతారాం, సర్పంచ్‌లు చుక్క రామునాయుడు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

జిల్లా పోలీసులకు ప్రశంసా పత్రాలు
విశాఖపట్నం, ఆగస్టు 15: నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా ఎస్‌పి రాహుల్ దేవ్ శర్మ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన సిటీ పోలీసు ఫెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి, పరిపాలన సిబ్బందితో పాటు మొత్తంగా యాభై మందికి ఈ సందర్భం గా ప్రశాంసా పత్రాలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా ఇన్‌చార్జి మినిస్టర్ యనమల రామకృష్ణుడు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ మినిస్టర్ అయ్యన్న పాత్రుడు, సిపి యోగానంద్ పాల్గొన్నారు.