విశాఖపట్నం

జెండా వందనం వివాదాస్పదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, ఆగస్టు 15: స్థానిక మం డల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన జెండా వందన కార్యక్రమం వివాదాస్పదమైంది. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత జాతీయ జెండాను అగౌరవ పరిచారని మాజీ ఎమ్మెల్సీ డి.వి. ఎస్.రాజు, ఎం.పి.పి. వరహాలమ్మ, జెడ్పిటిసి వెంకటలక్ష్మి, ఎం.పి.టి.సి.లు పాప, వెంకటరమణలు ఆరోపించారు. దీనికి నిరసనగా వీరందరూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందేమాతరం, గణగణమన గీతాలను ఆలపించకుండా షెల్యూట్ చేయకుండా హడావుడిగా ఎగురవేసి ఎమ్మెల్యే వెళ్ళిపోయారని వారు విమర్శించారు. ప్రొటోకాల్ ప్రకారం మండల పరిషత్‌లో ఎం.పి.పి. జెండా ఎగురవేయాలన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ విషయమై టిడిపి నాయకులు మాట్లాడుతూ జెండా వందన కార్యక్రమం వివాదం కావడానికి ప్రధాన కారణమైన మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని మండల దేశం పార్ట అధ్యక్షుడు లాలం కాశీనాయుడు డిమాండ్ చేశారు.