విశాఖపట్నం

మన్యం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఆగస్టు 15: విశాఖ మన్యం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఐటిడిఎ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. స్థానిక తలారిసింగ్ కేంద్రీకృత ఆశ్రమోన్నత పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహించిన 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరితో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో గౌరవ వందనం స్వీకరించి మువ్వెన్నల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారి సహకారంతోనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యమని అన్నారు. గిరిజనులను సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రూ. 3 కోట్ల 15 లక్షల విలువ చేసే మేకలు, మిక్సర్లను ఎమ్మె ల్యే ఈశ్వరితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని ఐదు మండలాలకు చెందిన వెయ్యి 23 మంది గిరిజన లబ్ధిదారులకు మేకల యూనిట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పాడేరు పట్టణ పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.