విశాఖపట్నం

లక్షన్నర స్మార్ట్ మీటర్ల ఏర్పాటు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 16: అక్రమాలకు చెక్ పెట్టేందుకు సంస్థ ఆదాయాన్ని మరింతగా పెంచుకునే క్రమంలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతుంది. బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే స్మార్ట్ మీటర్లను ప్రవేశపెడుతోంది. దీనివల్ల అక్రమాలకు చెక్ పెట్టడంతోపాటు ఎప్పటికపుడు కార్యాలయం నుంచే విద్యుత్ వాడకం పరిస్థితి, లోపాలను తెలుసుకునే వీలుంటుంది. ఈ స్మార్ట్ మీటర్ ద్వారా వినియోగదారుడు తమ విద్యుత్ వాడకాన్ని సులభంగా తెలుసుకునే వీలుంటుంది. స్మార్‌మీటర్‌కు మొబైల్ సెల్ మాదిరి పోస్ట్‌పెయిడ్/ ఫ్రీ పెయిడ్ సిమ్‌కార్డులు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ప్రతినెల సక్రమ పద్ధతిలో బిల్లు చెల్లించేందుకు పోస్ట్‌పెయిడ్‌ను ఉపయోగించుకోవాలి. అదే ఫ్రీ పెయిడ్‌కు అయితే ఎప్పటికపుడు డబ్బులు వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డులో డబ్బు ఉన్నంద వరకు మీటర్ తిరుగుతుంది. ఆ తదుపరి దానంతట అదే ఆగిపోతుంది. ఈ విధానంతో వాడకం అనేది సులభంగా తెలిసిపోవడంతోపాటు సంస్థ సిబ్బంది చేతివాటానికి ఎటువంటి అవకాశం ఉండదు. అలాగే విద్యుత్ చౌర్యానికి పాల్పడే వీలుండదు. మాల్‌ప్రాక్టీస్, బ్యాక్‌బిల్లింగ్ వంటివి జరగనే జరగవు. ఈ విధంగా బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే స్మార్ట్ మీటర్లను నగరంలో కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మంగా ఏర్పాటు చేయడంతో ఇవి చక్కటి ఫలితాలనిస్తున్నాయి. అందువల్ల ఇపుడు సంస్థ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలకు దీనిని విస్తరించాలని యాజమాన్యం ఆలోచన చేస్తుంది. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి 1,50,000 స్ట్మార్ట్ మీటర్లు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని దశలవారీగా రానున్న నాలుగు మాసాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
* 2.5లక్షల ఇంధన సామర్ధ్య పంపుసెట్లు...
అలాగే విద్యుత్‌ను ఆదా చేయడంలో భాగంగా, సాంకేతికపరమైన విద్యుత్ సమస్యలను అధిగమించి సమర్ధవంతమైన, నాణ్యతతో కూడిన విద్యుత్‌ను అందించడం కోసం రానున్న మూడేళ్ళకాలంలో కనీసం 2.5 లక్షల మేర ఇంధన సామర్ధ్య వ్యవసాయ పంపుసెట్లను మార్పు చేయాలని సంస్థ లక్ష్యంగాపెట్టుకుంది. రైతులకు చెందిన వ్యవసాయ క్షేత్రాల్లో పాత వ్యవసాయ పంపుసెట్లను మార్పు చేసి వాటి స్థానంలో ఇంధన సామర్ధ్యం కలిగి ఉండే అత్యాధునిక వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే వీటన్నింటినీ ఒకేసారి యుద్ధప్రాతిపదికన కాకుండా రైతుల కోరిక మేరకు పాత వాటి వలన ఎదురయ్యే సాంకేతికపరమైన సమస్యలపై అవగాహన కల్పిస్తూనే ఇంధన సామర్ధ్య పంపుసెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సంబంధితాధికారి ఒకరు తెలిపారు.
* 24 గంటల్లో కొత్త కనెక్షన్లు
అన్నింటి కంటే ప్రధానంగా విద్యుత్ కొత్త కనెక్షన్లు ఇక నుంచి 24 గంటల వ్యవధిలో మంజూరు చేయాలని సంస్థ నిర్ణయించింది. అన్ని పత్రాలు అనుకూలంగా ఉంటే దీని మంజూరుకు ఎటువంటి ఆటంకాలు ఉండవని, అలాగే మీటర్ చార్జీలు తప్ప అదనంగా ఒక్క రూపాయి చెల్లించినక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లోను, అదే గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.