విశాఖపట్నం

అవసరమున్న చోట్ల లేని బస్ షెల్టర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని తరచూ ఆర్టీసీ అధికారులు ప్రచారంతో హోరెత్తిసుంటారు. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటామని చెపుతుంటారు. కానీ నగర పరిధిలో ఆర్టీసీ సేవల తీరుపై ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా సిటీ బస్‌లను, అవసరమైన వేళల్లో నడుపుతున్న తీరు తెలిసిందే. రద్దీగా ఉంటే సమయంలో తగిన బస్‌లు లేకపోవడంతో వేలాడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. బస్ సర్వీసుల తీరు ఇలా ఉంటే ప్రయాణికులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ల తీరు కూడా విమర్శలకు గురి అవుతున్నది. ప్రయాణికులకు అవసరమైన లేదా బస్‌లు ఆగే ప్రాంతాల్లో బస్ షెల్టర్లు నిర్మించాల్సి ఉంది. కానీ ఆ దిశగా ఆర్టీసీ అధికారులు చర్యలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. అవసరమైన చోట బస్ షెల్టరు నిర్మించకుండా, అవసరం లేని చోట్ల నిర్మించారు. కొన్ని బస్ షెల్టర్ల వద్ద బస్‌లు ఆపకపోవడం గమనార్హం. జాతీయ రహదారిపై ఎన్‌ఎడి జంక్షన్ సమీపంలో, దానికి ఎదురుగా రోడ్డుకు అవతలి వైపు ఎన్‌ఎస్‌టిఎల్ వద్ద బస్ షెల్టర్లు నిర్మించారు. కానీ అక్కడ బస్‌లు ఆగిన దాఖలాలు లేవు. బర్మా క్యాంప్ రిక్వెస్టు బస్‌స్టాప్ వద్ద కాలువపై బస్ షెల్టరు నిర్మించారు. అది ప్రయాణికులు వేచి ఉండేందుకు అనువుగా లేదు. అలాగే కప్పరాడ రిక్వెస్టు స్టాప్, జాతీయ రహదారిపై ఊర్వశి జంక్షన్ వద్ద బస్ స్టాప్‌లు లేవు. దొండపర్తి డిఆర్‌ఎం కార్యాలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా కూడా ఇదే పరిస్థితి. నగరంలో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. చాలా కాలంగా ఈ పరిస్థితి నెలకొని ఉన్నా బస్‌లు ఆగే చోట బస్‌లను ఆపడం లేదా బస్‌లను ఆపే చోట బస్ షెల్టర్ల ఏర్పాటు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వానల నుంచి తలదాచుకునేందుకు ప్రయాణికులు కనీస సౌకర్యం లేక ఇక్కట్లు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ఈ విషయమై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.