విశాఖ

పరుగులు తీసిన గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.కొత్తపల్లి గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన బాణసంచా పేలుడుతో గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామస్థులు కూడా ఆందోళన చెందారు. బాణాసంచా పేలుడుతో ఏ.కొత్తపల్లి గ్రామంలో ముగ్గురు మృతి చెందగా నలుగురు పరిస్ధితి ఆందోళన కరంగా ఉంది. కొత్తపల్లి అంబేద్కర్ కాలనీలోని ఒక పూరి పాకలో మందుగుండు తయారు చేస్తుండగా ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు శబ్దం రావడంతో గ్రామమంతా ఉలిక్కిపడింది. వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి మందుగుండు తయారు చేస్తున్న ఏడుగురు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో అందరినీ బయటికి తీసేసరికి అందులో కాటపల్లి బుజ్జి, గాలి రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. మరోక వ్యక్తి జుంజూరు శివ విశాఖ కేజిహెచ్‌లో చికిత్స పందుతూ మృతి చెందాడు. సాలూరు శివ, (25), కంచిపాటి మహేష్ (28), కొల్లూరి నాగేశ్వరరావు (35), ప్రాణాపాయ స్ధితిలో ఉన్నారు. కొల్లూరి సూర్యారావుకు (40) స్వల్ప గాయాలతో బైటపడ్డాడు. వీరిని 108 అంబులెన్సులో విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. గ్రామం మధ్యలో మందుగుండు తయారు చేయడం వలన పేలిన శభ్ధానికి గ్రామ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సంఘటనా స్ధలానికి అనకాపల్లి ఆర్డీఓ ఆర్.పద్మావతి, చోడవరం సిఐ మురళీధర్‌రావు, చనిపోయిన వివరాలను తనకు స్వయంగా పంపితే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆపధ్భాందు పధకంలో పరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చనిపోయిన వారిలో కాటపల్లి బుజ్జి, గాలి రాంబాబు, జుంజూరు శివ అదే గ్రామానికి చెందిన వారు. నిత్యం కూలిపనికి వెళ్తూ ఉండేవారు. కెఎం పాలెం గ్రామానికి చెందిన కంచిపాటి మహేష్ బాణా సంచా తయారు కేంద్రంలోకి రోజుకి కూలి పనికి వెళ్లేవాడు. తయారు కేంద్రం యజమాని కొల్లూరి సూర్యారావు, కొల్లూరి నాగేశ్వరరావుతో కలిసి ఉదయం 9 గంటలకు బాణా సంచా పని ప్రారంబించేవారు. మందుగుండు తయారు చేస్తుండగా 11 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. దీంతో యజమానితో సహా కూలి పనికి వచ్చిన వారు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. సంఘటనా స్ధలానికి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ పరిశీలించి గ్రామ పెద్దలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనధికారిక మందుగుండు తయారు కేంద్రాలు ఎక్కడ ఉన్న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘటనకు సంబందించి వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూబ గురుమూర్తి, ఎంపీటీసి పెద్దాడ వెంకటరమణ, పోతల పాత్రునాయుడు, గంధం జగన్న, కర్రి సత్యం బాధిత కుటుంబాలను పరామర్శించారు.