విశాఖపట్నం

205 మంది నర్సుల నియామకానికి రెండు రోజుల్లో ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: చాలాకాలం తరువాత నర్సుల పోస్టులు భర్తీ అవుతున్నాయి. అయినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. వాస్తవానికి కేజిహెచ్‌లో దాదాపు 1500 మంది నర్సులు ఉంటే తప్ప రోగులకు సేవలందించలేరు. ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిషా, చత్తీస్‌గడ్, రాయగడ, మధ్యప్రదేశ్ తదితర చోట్ల నుంచి దీర్ఘకాలిక రోగాలతోపాటు వారంతా తరలివస్తుంటారు. ఈ విధంగా ప్రతిరోజు రెండు వేలకు పైగానే ఔట్ పేషెంట్‌లు (ఓపి)లు నమోదవుతున్నాయి. వీరిలో వివిధ రకాలైన పరీక్షలు, వైద్యుల తనిఖీలు జరుపుకుని మందుల తీసుకుని వెళ్ళిపోతుంటారు. వీరిలో కనీసం 30 నుంచి 40 శాతం మంది కేజిహెచ్‌లో చేరుతుంటారు. ఆర్ధోపెడిక్, పిల్లలు, గైనిక్, కార్డియాలజీ తదితర విభాగాల్లో చికిత్స నిమిత్తం నెలల తరబడి ఉంటుంటారు. ఈ విధంగా వందలాది మంది రోగులకు సేవలందించాలంటే నర్సుల అవసరమే ఎక్కువుగా ఉంటుంది. వైద్యులు సూచించిన మేరకు ఎప్పటికపుడు రోగులకు చికిత్సనందిస్తూ పర్యవేక్షిస్తుండాలి. రేయింబవళ్ళు నర్సులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతటి ముఖ్యమైన నర్సుల పోస్టులను భారీగా భర్తీ చేయాల్సిందిపోయి కేవలం 160 మందితో సరిపెట్టింది. దీనివల్ల ఎటూ చాలకుండా ఉండే నర్సులను ఏ విధంగా ఉపయోగించుకోవాలంటూ వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న రోగులకు అందించే సేవల కోసం కనీసం వెయ్యి మంది నర్సుల అవసరాన్ని గుర్తించి వైద్యాధికారులు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను గత మూడేళ్ళుగా పంపుతునే ఉన్నారు. తరచూ కేజిహెచ్‌లో పర్యటించే రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్, విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి నర్సుల సంఖ్యలో పెంచాల్సిందిగా కోరుతూనే ఉన్నారు. అయినా కేవలం 205 పోస్టుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీనిలో ఘోసాసుపత్రికి 20, ఛాతి ఆసుపత్రికి మరో 25 పోస్టులు కేటాయించింది. దీంతో కేజిహెచ్‌కు మిగిలింది కేవలం 160 మంది నర్సులు మాత్రమే. ఆన్‌లైన్ ద్వారా భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అధికారులు దరఖాస్తుల పరిశీలన, కలెక్టర్ అనుమతి పొందగలిగారు. దీంతో మరో రెండు రోజుల్లో ఎంపికైన 205 మంది నర్సులకు నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూధనబాబు తెలిపారు.
* సర్కార్ వివక్ష
కేజిహెచ్‌కు అవసరమైనన్ని నర్సుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సర్కార్ సవతితల్లిప్రేమను చూపుతోందని, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా కేజిహెచ్‌ను అన్నివిధాలా అభివృద్ధిపర్చి వైద్యసేవలు అందిస్తామంటూ ప్రచారం చేస్తోన్న సర్కార్ కార్యచరణలో చూపకపోవడంపట్ల ఆసుపత్రి వర్గాలు సైతం విస్మయం చెందుతున్నాయి. రోగుల పడకలు, ఆయా వార్డుల్లో వౌళిక వసతులను విస్తరించడంలోను సర్కార్ నిర్లిప్తత స్పష్టమవుతోంది.