విశాఖపట్నం

పార్టీకి కార్యకర్తలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 18: పార్టీకి కార్యకర్తలే కీలకమని, వారి తర్వాతే అందరూ అని కేంద్ర రోడ్లు, నౌకాయానశాఖామంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విశాఖ సాగరతీరంలోనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి గురువారం రాత్రి తిరంగయాత్ర ప్రారంభమైంది. దీనిని ఆయన ప్రారంభించారు. ఇది సాగరతీరంలోనున్న పలు ప్రాంతాల మీదుగా అప్పుఘర్ జంక్షన్ సమీపానున్న బిజెపి పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఇక్కడ నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి కేంద్ర మంత్రి గడ్కరీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల కంటే పార్టీ కార్యకర్తలే ఏ పార్టీకైనా బలమని అన్నారు. పార్టీల బలోపేతానికి, విజయవంతానికి ముఖ్యమైన, కీలకమైన వారు కార్యకర్తలేనన్నారు. వీరుతోనే పార్టీలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సి ఉందన్నారు. విశాఖ పార్లమెంటు సభ్యులు డాక్టర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 150 ప్రముఖ ప్రదేశాల్లో, 75 మంది కేంద్రమంత్రులు పాల్గొనే విధంగా దేశ ప్రధాని మోదీ నిర్దేశించడం జరిగిందన్నారు. అలాగే తిరంగయాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వాతంత్ర సమరయోధులు తెనే్నటి విశ్వనాధం, గౌతు లచ్చన్న, పింగలి వెంకయ్య, పోట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు వీరంతా ఆంధ్రాకు చెందినవారేనని, వీరందరికీ పలుచోట్ల కేంద్రమంత్రి నివాళులర్పించారన్నారు. ఆనందపురం-అనకాపల్లి మధ్యన ఆరవ లైన్ రహదారి నిర్మాణం విశాఖ అభివృద్ధికి సూచికంగా ఆయన పేర్కొన్నారు. దీనికి 2,500 కోట్లు కేంద్రమంత్రి గడ్కరీ మంజూరు చేశారని, అలాగే షీలానగర్-సబ్బవరం మధ్య 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి మరో రూ.500 కోట్లు కేటాయించారన్నారు. ఈ రెండు పూర్తయితే విశాఖ ముఖచిత్రమే మారిపోతుందన్నారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రానకి 65వేల కోట్ల రూపాయల మేర జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్ర మానవవనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి కాంబినేషన్‌తో అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. ప్రజలు కోరుకున్నట్టుగా భద్రత, అభివృద్ధిపై ఈ ప్రభుత్వాలు దృష్టిపెట్టాయన్నారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో అంతే బడ్జెట్‌ను ఒక్క కేంద్ర మంత్రి గడ్కరీ ఈ రాష్ట్రానికి 65వేల కోట్ల మేర కేటాయించడం హర్షణీయమన్నారు. విశాఖ పోర్టు కాలుష్యంపై అవసరమైన ఇంటర్నేషనల్ కన్సల్టెంట్‌ను నియమించాల్సి ఉందన్నారు.
గడ్కరీకి ఘన సత్కారం...
కేంద్ర మంత్రి గడ్కరీకి పలువురు ఘనంగా సత్కరించారు. సత్కరించిన వారిలో విశాఖ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్‌కుమార్, పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు ఉన్నారు. అలాగే స్వాతంత్ర సమరయోధులు కెఎస్ శాస్ర్తీ, రూపాకుల విశాలాక్షి, కార్గిల్ యుద్ధంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కర్రి శ్రీనివాసరావును కేంద్ర మంత్రి గడ్కరీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎం.నాగేంద్ర, మళ్ళ వెంకట్రావు, టి.సుబ్బిరామిరెడ్డి, మహిళా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.