విశాఖపట్నం

నిప్పు రాలుతోంది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: సూర్యుడు మండుతున్నాడు. వేసవి ఆరంభంలోనే తన ప్రతాతాన్ని చూపుతున్నాడు. దీంతో జనం విలవిల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల మృతులు నగరవాసులను బెంబేలెత్తెలా చేస్తోంది. ఇప్పటి నుంచే ఎండల తీవ్రతతో శరీరం మండిపోవడం, వేడిగాలులను ఎదుర్కోవాల్సి వస్తోంది. రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం విశాఖ నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. విశాఖ విమానాశ్రయంలో 37 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు తక్కువుగా కనిపిస్తున్నారు. రైళ్ళల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు కాస్తంత ముందుగానే స్టేషన్‌కు చేరుకుని సేద తీరుతున్నారు. అలాగే వృద్ధులు, మహిళలు, చిన్నారులు సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రయాణాలు చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి నగరానికి వివిధ పనుల్లో వచ్చే వారి సంఖ్య గత నాలుగు రోజులుగా తగ్గిపోయింది. భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, చిల్లర వర్తకులు ఎండల్లో ఎండల తీవ్రతకు ఆందోళన చెందుతున్నారు.
* రైతుబజార్లలో కనిపించని జనం
కాస్తంత చౌకగా లభించే కూరగాయలు, నిత్యావసర సరకుల కోసం రైతుబజార్లకు వెళ్ళే సామాన్యులు ఎండల తీవ్రతతో వెళ్ళేందుకు భయపడుతున్నారు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా ఉదయం 11గంటల్లోపే రైతుబజార్లకు వెళ్ళి కూరలు కొనుగోలు చేసుకుని ఇళ్ళకు తిరుగు ముఖం పడుతున్నారు. ఈమధ్య మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైతుబజార్లు జనంతో నిండేవి. నగరంలోని సీతమ్మధార, అక్కయపాలెం, ఎంవిపి కాలనీ, మధురవాడ,కంచరపాలెం, గోపాలపట్నం, మర్రిపాలెం తదితర రైతుబజార్లల్లో జనం పల్చబడుతున్నారు. ఇళ్ళ నుంచి బయలుదేరె వీరంతా ఎండల తీవ్రతతో 11గంటల్లోపే కూరలు కొనుగోలు చేసుకుని తిరుగు ముఖం పడుతున్నారు.
* మండుటెండల్లో పిల్లలు
ప్రతిరోజు 12గంటలతో ముగిసే పదవ తరగతి పరీక్షలు తదుపరి 12.30 గంటల నుంచి ప్రైవేటు తెరుచుకుంటున్నాయి. దీంతో చిన్న పిల్లలు నరకం చూస్తున్నారు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సూళ్ళు ఉంటున్నాయి. పదవ తరగతి పరీక్షల కారణంగానే ఈ విధంగా మధ్యాహ్నం నుంచి స్కూళ్ళ సమయాలను మార్పు చేసినట్టుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే దీనివల్ల మండుటెండల్లోనే తమ పిల్లలను తల్లిదండ్రులు స్కూళ్ళకు దిగపెట్టాల్సి వస్తోంది. ఈ సమయంలో ఎండ తీవ్రంగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతున్నారు.