విశాఖపట్నం

జల వనరుల సంరక్షణపై గీతం విద్యార్ధుల నగర ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (కల్చరల్) మార్చి 22: ప్రపంచ జల వనరుల దినోత్సవం సందర్భంగా గీతం విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విద్యార్ధులు సభ్యులుగా గల ఇంజనీర్స్ వితపుట్‌బోర్డర్లు (ఇండియ) విద్యార్ది విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్తానిక ఆర్‌కెబీచ్ నుంచి వైఎంసిఏ వరకు భారీ నగర ప్రదర్శనకు నిర్వహించారు. వాన నీటిని సంరక్షించుకుందాం, పొదుపుగా నీటిని వాడుకుందాం-్భవిష్యత అవసరాలకు దాచుకుందాం వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను విద్యార్ధులు ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నీటి వనరుల సంరక్షణ ప్రతి పౌరునికి బాధ్యత అని అలాగే జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందాన్నరు.

ప్రతి నీటి బొట్టు ఆదా చేయాలి
విశాఖపట్నం, మార్చి 2: ప్రతి నీటిబొట్టుని ఆదా చేసి భవిష్యత్‌తరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఆంధ్రాయూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు, మేథావులు, శాస్తవ్రేత్తలు పిలుపునిచ్చారు. ప్రపంచనీటి దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏయు వైవియస్ మూర్తి ఆడిటోరియంలో ఏపీ కాలుష్యనియంత్రణ మండలి, సమైఖ్య, గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ సర్వీస్ సొసైటీలు సంయుక్తంగా జలవనరుల పరిరక్షణ వర్క్‌షాప్ నిర్వహించారు. ముందుగా జ్యో ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్‌ఇఎస్ చైర్మన్ డాక్టర్ విఎస్‌ఆర్‌కె ప్రసాద్ మాట్లాడుతూ వాతావరణంలో మారుతున్న మార్పులకనుగుణంగా నీటి శాతం తగ్గిపోతుందని, గ్లోబలైజేషన్‌లో భాగంగా పరిశ్రమల స్థాపన, వనరులను పెంచి కాలుష్యాన్ని అధికం చేస్తున్నామని దీని నుండి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వ్యవసాయ పంటలు అధికోత్పత్తికోసం వివిధ రకాల కెమికల్స్ కలిపిన పురుగుల మందులు కావడం ద్వారా నీరు కలుష్తిమైపోతుందని వీటిని సేవించడం వలన మానవులు, జీవచరాలు వివిధ రకాల రుగ్మతలకు గురవుతున్నారన్నారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆంధ్రాయూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్‌వి రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రపంచ జల వనరుల దినోత్సవాన్ని 1993 లో మొదలు పెట్టడం జరిగిందన్నారు. 1994లో ప్రకటించారని నాటి నుం ప్రతి ఏడాది మార్చి 22వ తేదీన నీటి సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది మంచినీరు-మంచి ఉపాధులు అన్న నినాదాన్ని ప్రకటించిందని ప్రపంచవ్యాప్తగా జరుపుకుంటున్నామన్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్పవరం నీటి వనరులని ఇవి అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రస్తుతం నీటి సమస్య అధికంగా ఉంటుందన్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. తక్షణ పరిష్కారం నిమిత్తం ఇంకుడు గుంటల ఉద్యమం చేపట్టాలన్నారు. అడవులను, నీటి పరివాహక ప్రాంతాలను కాపాడుకోవాలన్నారు. పలు అధికారులు పాల్గొన్నారు.