విశాఖపట్నం

విపత్తు ఉపశమన ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 23: విపత్తు ఉపశమన ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనులు సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. తన ఛాంబర్‌లో ఎపి డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు కింద చేపట్టిన ప్రాజెక్టులపై మంగళవారం పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఎపి ఇపిడిసిఎల్, జివిఎంసి, ఉడా, అటవీశాఖ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, బిఎస్‌ఎన్‌ఎల్ తదితర శాఖలకు ప్రపంచ బ్యాంకు విపత్తు ఉపశమన ప్రాజెక్టులు మంజూరు చేసిన పనులను కలెక్టర్ ఆరా తీశారు. ఇప్పటికే చేపట్టిన పనులు సత్వరమే పూర్తి చేయాలని, ఇంకా చేపట్టని పనులకు తక్షణమే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. పనులు చేపట్టేందుకు తాజాగా అనుమతులు కావాలంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 26న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విశాఖలో పర్యటించనున్న దృష్ట్యా ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన ఎకో పార్కు ఇది వరకే వర్క్‌షాప్ ప్రారంభమైందని, జంతు ప్రదర్శన శాల పనులకు కన్సల్టెంట్‌ల కోసం ఎదురు చూస్తున్నట్టు అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రదీప్ కుమార్ వివరించారు. సమావేశంలో వుడా ఉపాధ్యక్షుడు బాబూరావు నాయుడు, జివిఎంసి కమిషనర్ హరినారాయణన్, చీఫ్ ఇంజనీర్ చంద్రయ్య, రెవెన్యూ అధికారి చంద్రశేఖరరెడ్డి, ఇపిడిసిఎల్ ఇడి రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.