విశాఖపట్నం

స్మార్ట్ పోలీసింగ్ ....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 25: స్మార్ట్‌సిటీగా రూపాంతం చెందుతున్న విశాఖ నగరంలో ఇక స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. నేరాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నగర పోలీసు విభాగం ముందుకు సాగనుంది. నేరాల నియంత్రణలో కీలకమైన అంశాలను క్రోఢీకరించడంతో పాటు నేర నియంత్రణలో ముందస్తు చర్యలకు నిఘా కెమేరాలను వినియోగించనుంది. ముఖ్యంగా నగరంలో విశృంఖలతకు సాక్ష్యంగా నిలుస్తున్న బైక్ రేసింగ్‌లపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. నగరంలోని ఇంటర్ పై చదువులు చదువుతున్న విద్యార్థులు సరదా పేరిట సాగిస్తున్న బైక్ రేసింగ్‌లు ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విచ్చలవిడిగా సాగుతున్న బైక్ రేసింగ్‌ల వల్ల యువకులు తమ విలువైన ప్రాణాలతో పాటు అమాయకుల ప్రాణాలను హరిస్తున్నారు. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న యువతను అదుపు చేసేందుకు నగర పోలీసు విభాగం కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా సాగుతున్న బైక్ రేసింగ్‌లను నియంత్రించేందుకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌పోలీసింగ్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నగరం మొత్తాన్ని నిఘా నీడకు తీసుకువచ్చే ప్రణాళిక మరో 10 రోజుల్లో అందుబాటులోకి రానుంది. సంఘటన జరిగిన తర్వాత జల్లెడ పట్టే విధానానికి స్వస్తి చెప్పే విధంగా స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. నగరంలో కుర్రకారు ఆగడాలకు పాల్పడుతున్న ప్రాంతాలను గుర్తించిన పోలీసు యంత్రాంగం ఇప్పటికే 47 ప్రాంతాల్లో 128 సిసి కెమేరాలను ఏర్పాటు చేసింది. ఇంకో వారం రోజుల వ్యవధిలో మరో 47 ప్రాంతాల్లో 130 కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నగరంలోని ప్రధాన రహదార్లన్నీ నిఘా నీడలోకి రానున్నాయి. ముఖ్యంగా ఆర్‌కె బీచ్ నుంచి భీమునిపట్నం వరకూ బీచ్‌రోడ్డులో చోటుచేసుకుంటున్న బైక్ రేసింగ్‌లే లక్ష్యంగా నగర పోలీసు యంత్రాంగం ఈ పటిష్ఠమైన చర్యలకు సన్నద్ధమవుతోంది. అలాగే జాతీయ రహదారితో పాటు హనుమంతవాక నుంచి సింహాచలం, గోశాల నుంచి వేపగుంట, వేపగుంట నుంచి పెందుర్తి, బిఆర్‌టిఎస్ రహదార్లు రాత్రి 10 గంటలు దాటితే నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యంత విశాలమైన రహదార్లను యువత బైక్ రేసింగ్‌లకు ట్రాక్‌గా ఉపయోగించుకుంటోంది. వీరిని నియంత్రించేందుకు నిఘా కెమేరాలను అనుసంధానం చేస్తూ కమిషనరేట్‌లో ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. సుమారు 130 మానిటర్స్‌తో ఈ సెంటర్ నగరం మొత్తాన్ని జల్లెడ పడుతుంది. ఏ మూల ఏ జరుగుతున్నా క్షణాల్లో కమాండ్ సెంటర్‌కు తెలిసిపోతుంది. దీంతో అందుబాటులో ఉన్న పోలీసు యంత్రాంగం ఆఘమేఘాలమీద ఘటనాస్థలికి చేరుకుంటారు. బైక్ రేసింగ్‌లే కాదు, చైన్ స్నాచింగ్, ఇతర నేరాలను సైతం ఇట్టే ఛేదించేందుకు స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఇక నేరస్తుల ఆగడాలకు కళ్లెం పడినట్టే.

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య
గాజువాక, మార్చి 25: ఇంజనీరింగ్ పూర్తయినా ఉద్యోగం లభించలేదన్న మనో వేదనతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనకు సంబంధించి స్టీల్‌ప్లాంట్ పోలీసులు అందించిన వివరాల మేరకు స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్ 2లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ నాయక్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యశ్వంత్ (21) బిటెక్ పూర్తి చేసి, కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. చదువులో భాగంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న యశ్వంత్ గురువారం విశాఖలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఉద్యోగ లభించలేదన్న మనస్తాపంతో ముభావంగా ఉన్న యశ్వంత్ గురువారం రాత్రి తన పడకగదిలో ఫేన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.