విశాఖపట్నం

విసి పదవి కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 25: రాష్ట్రంలో పేరేన్నికగన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవికి అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు శ్రీ వేంకటేశ్వర, ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వైస్ ఛాన్సలర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇన్‌ఛార్జి పాలనలోనే కొనసాగుతొంది. ఇప్పటికే వివిధ విశ్వవిద్యాలయాల్లో 1100 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ నియామకాన్ని త్వరితగతిన చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కృష్ణ యాదవ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఇన్‌ఛార్జి విసి ఇఎ నారాయణ, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, మాజీ విసి జిఎస్‌ఎన్ రాజు పోటీలో ఉన్నారు. వీరితోపాటు మాజీ రిజిస్ట్రార్ జెఎం నాయుడు, అనిట్స్ విఎస్‌ఆర్‌కె ప్రసాద్, ఎయు మాజీ ప్రిన్సిపల్ ఎల్‌కె మోహన్, రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడు రొక్కం సుదర్శనరావు, జెఎన్‌టియు మాజీ విసి అల్లం అప్పారావు తదితరులు బరిలో ఉన్నారు.
కాగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవిని కాపు కులానికి కట్టబెట్టాలని కొందరు ప్రభుత్వంపై వత్తిడి తెస్తుండగా, మరి కొందరు యాదవ సామాజిక వర్గానికి కట్టబెట్టాలని పట్టుబడుతున్నట్టు బోగట్టా. దీంతో ఈ దఫా వైస్ ఛాన్సలర్ పదవికి కాపు, కమ్మ, యాదవుల నుంచి వత్తిడి పెరుగుతొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెర్చ్ కమిటీ ఆయా సామాజిక వర్గాల నుంచి ఎవరెవరు బరిలో ఉన్నారు? వారికి అర్హతలు ఏమిటి అన్న విషయమై వడపోత ప్రారంభించింది. ఇదిలా ఉండగా ఈ పదవి కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బిజెపి నేత వెంకయ్యనాయుడు ఆశీస్సుల కోసం ఆయా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరో పది రోజుల్లో సెర్చ్ కమిటీ ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. విసి పీఠం కోసం హేమాహేమీలు తలపడుతున్న తరుణంలో ఈ దఫా ఈ పీఠం ఎవరిని వరించనుందో వేచి చూడాలి.

వృద్ధుల సంక్షేమానికి ఎయు ముందంజ
* జరంటాలజీ కోర్సుకు ఇసి ఆమోదం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 25: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జెరంటాలజీ కోర్సుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయడం, వాటికి పరిష్కారాలను చూపేందుకు జరంటాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జెరంటాలజీ గురించి వివరించారు. వృద్ధులను ఆదుకునేందుకు ఓల్డేజి హోమ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ వాటికి నిధుల కొరత, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. దేశంలో కుటుంబ వ్యవస్థ ఎంతో పటిష్టమైందని, దీనిని సంరక్షించుకుంటూ వృద్ధుల సంక్షేమానికి, సంరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులను ఆదరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. గ్రామాలను దత్తత తీసుకునే మాదిరిగా వృద్ధులను కూడా దత్తత తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందన్నారు. నేటికి సమాజంలో వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు, విదేశాలలో కొడుకులు జీవిస్తున్నారని అన్నారు. కొడుకులు విలాసవంతమైన జీవనం గడుపుతున్నప్పటికీ తల్లిదండ్రుల వైపు కనె్నత్తి చూడకుండా వదిలిపెట్టిన సందర్భాలు అనేక మంది జీవితాలలో ఎదురవుతున్నాయన్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సరైన దిశగా చర్యలు చేపడితే బాగుంటుందన్నారు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి జెరంటాలజీ ద్వారా తాము కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో వృద్ధుల సమస్యలకు పరిష్కారం లభించగలదన్నారు.