విశాఖపట్నం

మానవ ఐక్యతను చాటేది రక్తదానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం ఆగస్టు 28: రక్తదానం మానవ ఐక్యతను చాటుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ అన్నారు. సంత్ నిరంకారీ మండల్ ఆధ్వర్యంలో ఆదివారం నౌరోజీరోడ్డులో నున్న సింధు భవనంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి మంచి స్పందన లభించింది. వంద మంది భక్తులు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్ ద్వారా రక్తదానం చేశారు. 18 ఏళ్ళుగా ప్రతి ఏడాది విశాఖలో రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్‌బ్యాంక్‌కు వందలాది యూనిట్ల రక్తం అవసరమైన వారికి, ఆపదలో ఉన్న నిరుపేదల సహాయార్థం నిరంకారీ మిషన్ అందిస్తుండటం అభినందనీయమన్నారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500కు పైగా శిబిరాలు ఏర్పాటు చేసి నాలుగు వేలకు పైగా నిరంకారీ భక్తులు తమ రక్తాన్ని మానవ ఐక్యత కోసం దానం చేయడం గర్వించదగినదిగా పేర్కొన్నారు. సద్గురు బాబా గురుబచన్‌సింగ్ 1980 ఏప్రిల్ 24న మానవత్వం కోసం తన జీవితాన్ని బలిదానమిచ్చి తనువు చాలించారని, ప్రతి ఏడాది ఏప్రిల్ 24న మానవ ఐక్యతా దినంగా నిరంకారీ మండలి జరుపుకుంటుందన్నారు. రక్తదానం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సద్గురు సంత్ నిరంకారీ ఛారిటబుల్ ఫౌండేషన్ విశాఖ అధ్యక్షుడు మిరీపూరీ ప్రేమ్‌జీ మాట్లాడుతూ సద్గురు సందేశాన్ని జనులకందించారు. అలాగే రక్తదాన శిబిరం నడుమ భారీ సత్సంగం కూడా నిర్వహించారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ రక్తదానం ఇచ్చిన సంస్థగా నిరంకారీ సత్సంగ్ నిలుస్తుందన్నారు. ప్రతి మనిషి భగవంతుని స్వరూపం అన్నారు. దేవుడైన పరమాత్మకు కులం, మతం, వర్ణం, జాతి భేదం లేదని అటువంటప్పుడు మానవులకెందుకని అన్నారు. అలాగే ఈ విధంగా సేకరించిన రక్తదానాన్ని ఆపదలో ఉన్న వారికి సమయానికి అందజేయడం, దేశరక్షణకు పాటుపడుతున్న మన దేశ సైనికులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పివి రావు, సత్యనారాయణరాజు, రాజ్‌వీర్, గద్దిపల్లి రాము, ఠాగుర్‌జీ, శర్మ, రత్నకర్, గణేష్, నర్సింగ్, ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.