విశాఖపట్నం

ఘనంగా జాతీయ క్రీడోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రీడా విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆర్కేబీచ్‌లోని వైఎంసిఎ వద్ద నుంచి ఎయులోని ధ్యాన్‌చంద్ విగ్రహం వరకూ వివిధ క్రీడా సంఘాలు, క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. ఎయు వీసీ ఆచార్య నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా నేటితరం క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. ధృఢ సంకల్పం ఉంటేనే క్రీడల్లో రాణించగలరని తెలిపారు. ఎయు రిజిస్ట్రార్ ఆచార్య ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ నిత్య సాధనతో క్రీడాకారులకు ఉన్నత స్థానాలను అధిరోహించగలరన్నారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎయు క్రీడా విభాగం ఆచార్యుడు విజయమోహన్, డాక్టర్ జిఎస్‌వర్మ, సారధి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి జూన్ గేలియో తదితరులు పాల్గొన్నారు.