విశాఖపట్నం

దాడికి గురైన రౌడీషీటర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 30: రౌడీల మధ్య జరిగిన ఆధిపత్యం పోరే రౌడీషీటర్ విజయకుమార్‌ను అంతమొందించింది. ఆదివారం రాత్రి లీలామహాల్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు కలిసి పసుపులేటి విజయకుమార్‌పై ఇనపరాడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడికి గురైన విజయకుమార్ కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. తెలుగు అనిల్ హత్య కేసులో తొమ్మిదో నిందితుడుగా ఉన్న విజయకుమార్ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం సృష్టించింది. పాత కక్షల నేపధ్యంలో హత్య జరిగిందా లేక మరే కారణమైన ఉందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
* విజయకుమార్‌పై హత్య చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు?
నగరం నడిబొడ్డున రౌడీషీటర్ విజయకుమార్‌ను ఇనపరాడ్లతో దారుణంగా హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే వారు పరారీలో ఉండడంతో ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.
* హత్యకు కారణమేంటి:
విజయకుమార్‌ను హత్య చేయడానికి గల ప్రధాన కారణాన్ని ప్రస్తుతం పోలీసులు విశే్లషిస్తున్నట్టు తెలిసింది. ఆరిలోవలో చోటా రౌడీగా తిరిగే ఓ వ్యక్తి రెండు నెలల క్రితం అల్లిపురం ప్రాంతానికి మకాం మార్చాడు. ఇది తెలిసిన విజయకుమార్ అతనిని పిలిచి నువ్వు మా ఏరియాలో ఉంటున్నావు, ఆరిలోవలో లాగా ఇక్కడ రూబాబ్ చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. నాకే విజయకుమార్ వార్నింగ్ ఇస్తాడా వాడి సంగతి చూడాలని సదరు వ్యక్తి హత్యకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. దీంతో కంచరపాలెంలో ఉంటున్న తన పిన్ని కుమారుడుని ఆదివారం లీలామహాల్ సెంటర్‌కు పిలిచి అక్కడి బార్‌లో ఉన్న విజయకుమార్‌తో గొడవ పడేలా సదరు వ్యక్తి చేశాడు. ఇందులో భాగంగా పిన్ని కుమారుడు, విజయకుమార్‌తో గొడవ పడ్డాడు. దీంతో విజయకుమార్ అతనిని కొట్టి కింద పడేగా అక్కడే ఉన్న సదరు వ్యక్తి ఇనపరాడ్లతో తలపై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో విజయకుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోగా, వీరిద్దరు అక్కడి నుండి బైక్‌లో పారిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. రెండో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.