విశాఖపట్నం

ప్రతి విభాగంలో ఇ-క్లాస్ రూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 30: అన్ని విభాగాల్లోనూ ఇ-క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య జి.నాగేశ్వరరావు వెల్లడించారు. దివ్యాంగులకు అదనపు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం మంగళవారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో ఉన్నత విద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా, సాంకేతిక విద్య కమిషనర్ ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేఖరుల సమావేశంలో వీసీ వివరించారు. ప్రతి విభాగంలో ఒక ఇ-క్లాస్ రూమ్ ఉండాలన్న లక్ష్యంతో 35 క్లాస్ రూమ్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న దివ్యాంగులకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా స్కాలర్‌షిప్, మెస్ చార్జీలను ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం భరించగా, మిగిలిన మెస్ చార్జీల మొత్తాన్ని ఎయు భరించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ తరహా నిర్ణయం రాష్ట్రంలోనే తీసుకున్న తొలి వర్సిటీ ఎయు అని తెలిపారు. రూసా నిధులు 20 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, ఇందుకు సవివర నివేదిక పంపితే 5 కోట్ల రూపాయలు ముందుగా విడుదల చేస్తారన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను పాలక మండలి ఆమోదించిందన్నారు. ఈ నిధులతో విద్యార్థినులకు అవసరమైన టాయిలెట్ల నిర్మాణం, వాష్‌రూమ్‌లు, వెయిటింగ్ హాల్స్ నిర్మిస్తామని, ఉన్న వాటికి మరమ్మతులు చేస్తామన్నారు. రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. ఎండోమెంట్ పతకాలు, మెరిట్ సర్ట్ఫికెట్లను అందచేసేందుకు 7 మంది దాతలు ముందుకు వచ్చారని, అవి ఆమోదించారని తెలిపారు. లైబ్రరీలో ఎస్‌ఆర్ రంగనాథ్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులకు 10 శాతం గ్రేస్ మార్కులు కలిపే అంశంపై వచ్చిన విజ్ఞాపనను ప్రభుత్వ పరిశీలనకు పంపేందుకు నిర్ణయించామన్నారు. పరిశోధనల్లో ప్రవేశానికి సంబంధించి ఆర్‌సెట్‌ను సెప్టెంబర్ నెలాఖరుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్లేస్‌మెంట్ ఆఫీసర్లను నియమించనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలను ముందుగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మూడింటికి వేర్వేరు జీవోలు జారీ కావాల్సి ఉందని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య ఉమా మహేశ్వరరావు, రెక్టార్ ఇఎ నారాయణ పాల్గొన్నారు.