విశాఖ

ప్రకంపనలో ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 30: విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన వివిధ చర్యలపై విపత్తుల నిర్వహణకు సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి తూర్పు నౌకాదళం నిర్వహిస్తున్న ప్రకంపన కార్యక్రమం మంగళవారం ఇక్కడి సముద్రిక ఆడిటోరియంలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, సహాయ, పునరావాస చర్యల గురించి చర్చిస్తున్నారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఉమ్మడిగా చేపట్టాల్సిన చర్యలను క్రోడీకరించి ప్రణాళిక తయారు చేయనున్నారు. హుదూద్ తుపాను నేపథ్యంలో తీసుకున్న చర్యలు, సహాయక చర్యల్లో చోటు చేసుకున్న లోపాలను సరిచేసేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, ముంబయి, ఉత్తరాఖండ్, హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసి ఆ నగరాలను అతలాకుతలం చేయడం తెలిసిందే. హుదూద్ తుపాను కారణంగా విశాఖ చిగురుటాకులా వణికి పోవడం తెలిసిందే. ఈ తరహా తుపాను 10 వేల సంవత్సరాల్లో ఒకసారి వస్తుంటుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 77 తుపానులు తీరం దాటాయి. మే, నవంబర్ నెలల్లో ఎక్కువగా తుపానులు వచ్చే అవకాశం ఉంటుంటుంది. తుపాను సమాచారాన్ని ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు చేరవేసి, నష్టాన్ని నివారించే వీలు ఉంటుంది. తుపాను తీరం దాటిన తరువాత సహాయ, పునరావాస చర్యలు కూడా నష్టాన్ని తగ్గిసాయి. వివిధ శాఖల సమన్వయంతో పని చేయడం ద్వారా తుపాను ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. హుదూద్ తుపానుకు సంబంధించి విజయగాథను ఐక్యరాజ్య సమితి కూడా అభినందించింది. ఈ నేపథ్యంలో దేశంలో విపత్తులు సంబంభించినప్పుడు తీసుకోవాల్సిన విపత్తు నిర్వహణ చర్యలపై చర్చించి సమగ్ర నివేదిక తయారు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రారంభ సమావేశం మంగళవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణపై బ్లూ బుక్ తయారు చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్త్, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జివిఎంసి కమిషనర్ హరినారాయణన్, జడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ, ఎంపి శ్రీనివాసరావు, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. తుపాను సమయంలో ఆయా శాఖలు చేపట్టిన చర్యలను వివరించారు.
ఆకట్టుకున్న ప్రదర్శన
తుపాను సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలను వివరించేందుకు వీలుగా అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మంత్రి గంటా, తదితరులు పరిశీలించారు. కమ్యూనికేషన్, వాహనాలు, జెమినీ బోట్లు, కమ్యూనికేషన్లు, వాహనాలు ప్రదర్శనలో ఉంచారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది తమ పనిమట్లతో వివిధ అంశాలను ప్రదర్శించారు.