విశాఖ

ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 1: ప్రాథమిక స్థాయి నుంచి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదేశించారు. పాడేరు మండలం దేవాపురం, ఈదులపాలెం గ్రామాలలో ఆయన గురువారం పర్యటించి పాఠశాలలను, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. దేవాపురం పాఠశాలల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని ఆరగించిన ఆయన భోజనం రుచికరంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాపురం పాఠశాలలో కె.సత్యవేణి, కె.అప్పలనర్స అనే ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోవడంపై వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులు చదువులో భాగా వెనుకబడి ఉండడాన్ని గమనించిన ఆయన ఉపాధ్యాయులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ గిరిజన విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయకపోతే చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ప్రాజెక్టు అధికారి ఆసుపత్రిలో వైద్యాధికారి, ఇతర సిబ్బంది లేకపోవడంపై ఎక్కడికి వెళ్లారని అందుబాటులో ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. అయితే వైద్యాధికారి, సిబ్బంది సెలవు దరఖాస్తులను పెట్టడంతో వాటిని పరిశీలించి సెలవు పెట్టకుండా విధులకు ఎగనామం పెట్టిన జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు ఒక రోజు జీతం నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈదులపాలెం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన శివశంకర్ విద్యార్థుల విద్యాభ్యాసాన్ని పరిశీలించి సంతృప్తికరంగా ఉండడంతో ప్రధానోపాధ్యాయుడుని అభినందించారు.