జాతీయ వార్తలు

వివిఐపి భద్రతా విధుల నుంచి వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మళ్లీ తమ అసలు బాధ్యతలను నిర్వర్తించే దిశగా ముందుకు సాగుతున్న ఎన్‌ఎస్‌జి (నేషనల్ సెక్యూరిటీ గార్డు) దళం వివిఐపి భద్రతా విభాగం నుంచి 600 మంది కమెండోలను ఉపసంహరించుకుని వారిని ఇటీవల పంజాబ్‌లోని పటాన్‌కోఠ్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేతకు ఉపయోగించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికపై గత రెండేళ్ల నుంచి కసరత్తు సాగిస్తున్న ఎన్‌ఎస్‌జి పఠాన్‌కోట్‌లో తొలిసారి తమ బ్లాక్ క్యాట్ కమెండోలను రంగంలోకి దింపింది. ఎన్‌ఎస్‌జి రూపొందించుకుంటున్న ఈ కొత్త ప్రణాళిక ప్రకారం 11వ ఎస్‌ఆర్‌జిలోని మొత్తం మూడు బృందాల్లో రెండు బృందాలను వివిఐపి భద్రతా విధుల నుంచి ఉపసంహరించి వాటికి ఎస్‌ఎజి లాంటి ప్రైమరీ స్ట్రైక్ యూనిట్స్‌తో కలసి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే బాధ్యతను అప్పగించారు. సైనిక అధికారులు, జవాన్లతో కూడిన రెండు స్పెషల్ యాక్షన్ గ్రూపులు, పారా మిలటరీ బలగాల సిబ్బందితో కూడిన మూడు స్పెషల్ రేంజర్స్ గ్రూపులు కలిపి మొత్తం ఐదు ప్రైమరీ యూనిట్లతో ఎన్‌ఎస్‌జి కమెండో బృందాలను ఏర్పాటు చేశారు.