తెలంగాణ

వ్యభిచారం చేయమంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డీ వ్యాపారులపై కలెక్టర్‌కు ఓ మహిళ ఫిర్యాదు
సుభాష్‌నగర్, జనవరి 2: తన అవసరాల కోసం అప్పు తీసుకున్న పాపానికి వడ్డీవ్యాపారులు తనపట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఓ బాధిత మహిళ శనివారం కలెక్టర్ యోగితారాణాను కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. ఆమె ఫిర్యాదుపై కలెక్టర్ స్పందిస్తూ, తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిప్రియనగర్‌కు చెందిన ఓ మహిళ పొరుగునే ఉండే కౌసల్య, దేవీసింగ్‌ల వద్ద నుండి 5వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఆమె వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లపై వారు సంతకాలు తీసుకుని ఆమెకు డబ్బులు ఇచ్చారు. తీసుకున్న అప్పు నుండి ఇటీవలే ఆమె 1400రూపాయలను చెల్లించింది. అయితే మరో 10వేల రూపాయలను చెల్లించాల్సి ఉందంటూ తనపై ఒత్తిడి తెస్తూ, బలవంతంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఓ గదిలో రెండు రోజుల పాటు నిర్బంధించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. వారి బారి నుండి ఎలాగోలా తప్పించుకుని వచ్చినట్టు తెలిపింది. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు బాధితురాలి ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు.